Saturday, April 20, 2024
- Advertisement -

నన్ను క్రిమినల్ గా చూస్తున్నారు: సుజీత్

- Advertisement -

సుజీత్ దర్శకత్వం లో ఇటీవలే వచ్చిన సినిమా సాహో. ఈ సినిమా అనూహ్యం గా బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలమవడం తో సుజీత్ మీద నెగటివిటీ పెరిగిపోయింది కానీ సుజీత్ దానిని తప్పుగా అర్ధం చేసుకున్నాడు.

“నేను నాకు నచ్చిన కథ తో ప్రభాస్ సర్ ని పెట్టి ఒక సినిమా చేసాను. నా నిర్మాతలు నన్ను నమ్మారు. ఈ సినిమా ని తీశారు. ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ సినిమా ని అభినందించారు. కానీ నన్ను మాత్రం చాలా కఠినం గా ట్రీట్ చేస్తున్నారు. నేను క్రైమ్ చేశాను అనే విధం గా నాతో ప్రవర్తిస్తున్నారు. ఎందుకు నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారో నాకు అస్సలు అర్ధం కావడం లేదు. నేను ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వూస్ లో ని మాటలని తీసుకొని ఇప్పుడు ఇలా చేయడం ఏమి బాలేదు. నేను కావాలనే మీడియా కి దూరం గా ఉన్నాను. ఎవరితో మాట్లాడదలచుకోలేదు. ఈ నెగటివిటీ అంతా తగ్గాక మాట్లాడాలి అనుకుంటున్నాను.” అని సుజీత్ తన బాధ ని వెల్లడించాడు.

నిజానికి సుజీత్ ఒక క్రైమ్ చేసాడు అని ఎవరూ భావించడం లేదు. ఏ దర్శకుడు ప్లాప్ సినిమా తీసిన జరిగేది ఇదే. అంతకు మించి మరొకటి లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -