Saturday, April 20, 2024
- Advertisement -

సాహో ని బాహుబలి తో పోల్చకండి!

- Advertisement -

రన్ రాజా రన్ సినిమా తో విజయం సాధించి ప్రస్తుతం సాహో సినిమా తో బిజీ గా గడుపుతున్నాడు దర్శకుడు సుజీత్. అయితే సుజీత్ ఈ సినిమా కోసం చాలా ఏళ్ళ నుండి కష్టపడుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. అయితే ఆగస్టు 15 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తం గా ఘనం గా విడుదల కానుంది. ఇటీవలే సినిమా కి సంబందించిన పోస్టర్స్ మరియు టీజర్స్ ఈ సినిమా మీద ఉన్న అంచనాలని అమాంతం పెంచేసింది. అయితే కొంత మంది సాహో ని బాహుబలి సినిమా తో పోలుస్తుండటం సుజీత్ కి నచ్చడం లేదు.

“సాహో సినిమా ని బాహుబలి తో పోల్చడం తగదు. బాహుబలి లాంటి సినిమా కేవలం ఒక్క సారి మాత్రమే సంభవం అవుతుంది. నేను సాహో గురించి ఎక్కువ గా మాట్లాడ తలుచుకోవడం లేదు. ఈ సినిమా విజయమే సినిమా గురించి మాట్లాడుతుంది.” అని సుజీత్ చెప్పాడు. ఈ సినిమా ని యువ వీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ నిర్మిస్తున్నాయి. శ్రద్ధ కపూర్ ఈ సినిమా తో తెరంగేట్రం చేయనున్నది. ఈ సినిమా కి సంబందించిన వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -