చేసిన తప్పే మళ్ళీ చేస్తున్న మెగా మేనల్లుడు

406
Sai Dharam Tej Is Repeating Same Mistakes Again and Again
Sai Dharam Tej Is Repeating Same Mistakes Again and Again

వరుస ప్లాపులతో సతమతం అయిన మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు ‘చిత్ర లహరి’ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది కానీ కలెక్షన్ల పరంగా మాత్రం సాయి ధరమ్ తేజ్ కి అనుకున్నంత బ్రేక్ ను ఇవ్వలేకపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం అంతకుముందు చేసిన తప్పే ఇప్పుడు తేజ్ మళ్ళీ రిపీట్ చేయబోతున్నాడని అభిమానులు చాలా నిరాశ చెందుతున్నట్లు తెలుస్తుంది. గతంలో సాయి ధరమ్ తేజ్ సినిమాలు ఫ్లాప్ అవడానికి గల కారణాల్లో ఒకటి ఫ్లాప్ దర్శకులతో సినిమాలు తీయడం.

వివి వినాయక్, కరుణాకరన్,, బి.వి.ఎస్.రవి, గోపీచంద్ మలినేని వంటి దర్శకులు ఏమాత్రం ఫాంలో లేని సమయంలో సాయి ధరంతేజ్ వారితో సినిమాలు తీశాడు. అయితే తాజాగా ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు తేజూ. ప్రస్తుతం అసలు ఫాంలో లేని మారుతి దర్శకత్వంలో ‘ప్రతి రోజు పండగే’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు మెగా మేనల్లుడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత తేజు సుబ్బు అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. అయితే ఎంత సేపు ఫ్లాప్ దర్శకులతో కాకుండా కొంచెం పేరున్న దర్శకులతో సినిమాలు తీస్తే బాగుంటుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.

Loading...