ప్రతి రోజు పండగే కథ ఏంటో తెలుసా?

449
Sai Dharam Tej's Prathi Roju Pandage Movie Story Leak
Sai Dharam Tej's Prathi Roju Pandage Movie Story Leak

చాలా నెలల నుండి మీడియా లో సాయి ధరమ్ తేజ్, మారుతీ సినిమా గురించి వార్తలు వస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఎట్టకేలకు ఈ సినిమా గత వారం సెట్స్ పైకి వెళ్లిన సంగతి మనకి తెలిసిందే. ప్రతి రోజు పండగే అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక కుటుంబ కథాంశం గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. అయితే తాజా మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా కథ ఒక కుటుంబానికి చెందిన మూడు తరాల మీద ఉంటుంది అంట. అయితే ఈ సినిమా లో కుటుంబ ప్రేమలు, ఆప్యాయతల్ని బాగా చూపెడతారని టాక్.

ఈ సినిమా లో సాయి ధరమ్ హీరో గా నటిస్తుండగా, అతని తండ్రి పాత్ర లో రావు రమేష్, మరియు తాతయ్య పాత్ర లో సత్యరాజ్ కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీరు ముగ్గురు మధ్యన వచ్చే కొన్ని సీన్లు చాలా ఆసక్తికరం గా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమా లో రాశి ఖన్నా హీరోయిన్ పాత్ర ని చేస్తుంది. గీత ఆర్ట్స్, యు వీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలు ఈ సినిమా ని నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు.

Loading...