Friday, March 29, 2024
- Advertisement -

తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకోలేను : సాయి పల్లవి

- Advertisement -

సాయి పల్లవి.. తెలుగులో ఫిదా సినిమాలో నటించి అందర్ని ఫిదా చేసింది. అయితే ఈమె పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుదని.. వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని.. తర్వాత సినిమాలు మానేస్తుందని ఇలా రకరకల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది.

తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం రూమర్స్ అని ఆమె కొట్టిపారేసింది. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని తెలిపింది. నేను ప్రస్తుతం పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టాను. పెళ్లి విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు. నాకు నా తల్లిదండ్రులంటే ప్రాణం. వారికోసమే నేను ఎప్పటికి పెళ్లి చేసుకోకుండా ఉండాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటే నేను వారితో ఉండలేను. అందుకే నేను వారు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాల్నుకుంటున్నానని సాయి పల్లవి తెలిపింది.

ఇక సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే స్కిన్ షోకి మాత్రం నో చెబుతోంది. స్కీన్ షో చేస్తే కోట్లు ఇస్తాం అంటున్న అందుకు నో చెబుతూ కేవలం పాత్ర ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తాను అంటుంది. తెలుగులో ఈమె “లవ్ స్టొరీ” సినిమాతో పాటు రానాతో విరాటపర్వం సినిమాను కూడా చేసింది. ఈ రెండు సినిమాల నుంచి వచ్చిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -