Wednesday, April 24, 2024
- Advertisement -

ఐటెం సాంగ్ లో సాయి పల్లవి?

- Advertisement -

సహజమైన నటన తో అందరినీ మెప్పిస్తూ ముందుకు సాగుతున్న హీరోయిన్ సాయి పల్లవి. ఒక వైపు నటన తో మరో వైపు తన డాన్స్ తో అందరినీ మంత్రం ముగ్ధుల్ని చేస్తూ ఎనలేని అభిమానం సంపాదించుకుంది పల్లవి. ప్రేమమ్ సినిమా తో మలయాళం అడుగు పెట్టి, ఆపై తెలుగు లో ఫిదా సినిమా తో తెరంగేట్రం చేసి ప్రస్తుతం తెలుగు లో మంచి స్థాయి లో ఉంది ఈ హీరోయిన్. అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం రానా సరసన విరాట్ పర్వం అనే సినిమా లో హీరోయిన్ గా నటించనుంది.

అయితే ఫిలిం నగర్ లో వినిపిస్తున్న తాజా పుకార్ల ప్రకారం సాయి పల్లవి ని ఐటెం సాంగ్ కోసం ఒక దర్శకుడు అప్రోచ్ అయ్యారట. అయితే ఇది అన్ని ఐటెం సాంగ్స్ లా కాకుండా డాన్స్ ప్రధానం గా స్పెషల్ గా ఉంటుంది అని పల్లవి ని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేశారట. కాకపోతే సాయి పల్లవి మాత్రం ససేమిరా అంది అని సమాచారం. పారితోషికం ఎంత ఇస్తా అన్నా కానీ స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ కి తను దూరం అని తేల్చి చెప్పింది అంట.

చేసేది ఏమి లేక ఇప్పుడు ఆ దర్శకుడు మరో హీరోయిన్ ని వెతికే పని లో ఉన్నారని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -