Friday, April 19, 2024
- Advertisement -

యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న సాయి ప‌ల్ల‌వి ‘రౌడీ బేబి’ సాంగ్‌

- Advertisement -

సాయి ప‌ల్ల‌వి మళ‌యాళ ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంత‌క‌ముందు మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రేమ‌మ్ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది. తెలుగులో ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. త‌మిళ భాష‌లో కూడా సినిమాలు చేస్తు ఫుల్ జోష్‌లో ఉంది సాయి ప‌ల్ల‌వి. ఆమె ఇటీవ‌ల త‌మిళంలో ధ‌నుష్ స‌ర‌స‌న మారి 2 సినిమాలో న‌టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. కాని ఈ సినిమాలోని రౌడీ బేబి సాంగ్ మాత్రం నేష‌న‌ల్ లేవల్లో పాపుల‌ర్ అయింది.

ఈ పాట‌లో ధ‌నుష్‌,సాయి ప‌ల్ల‌వి ఇద్ద‌రు అదిరిపోయే డ్యాన్స్‌ల‌తో అల‌రించారు. ముఖ్యంగా సాయి ప‌ల్ల‌వి త‌న హవా భావాల‌తో సాంగ్‌ను మ‌రో లేవ‌ల్‌కు తీసుకువెళ్లింది. ఈ పాట వ‌స్తున్నంత‌సేపు అంద‌రు సాయి ప‌ల్ల‌వినే చూస్తుంటారు. అంతలా ఈ సాంగ్‌లో డ్యాన్స్ వేసింది సాయి ప‌ల్ల‌వి. ఈ పాట‌ను ఇటీవ‌లే యూట్యూబ్‌లో విడువ‌ల చేశారు. అలా విడుద‌ల చేశారో లేదో ఈ వీడియో సాంగ్‌కు మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం. గ‌తంలో సాయి ప‌ల్ల‌వి న‌టించిన ఫిదాలోని ‘వచ్చిండే’ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది.

సౌత్ నుంచి అత్య‌ధిక వ్యూస్ సాధించిన వీడియో సాంగ్‌గా ఫిదాలోని ‘వచ్చిండే’ సాంగ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు త‌న రికార్డ‌ను తానే తిర‌గ‌రాసింది. మారి సినిమాలోని రౌడీ బేబి సాంగ్‌తో సౌత్‌లో అత్య‌ధిక వ్యూస్ సాధించిన సాంగ్‌గా హిస్ట‌రీ క్రియేట్ చేసింది సాయి ప‌ల్ల‌వి.రెండింట్లోనూ సాయి పల్లవి తన మార్క్‌తో అలరించింది.ఇప్పటికీ రౌడీ బేబీ వీడియోసాంగ్‌ను 183మిలియన్ల (దాదాపు 18కోట్లు) మంది వీక్షించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -