Thursday, April 18, 2024
- Advertisement -

సాయి పల్లవిని అలా కావాలని అడిగాడట..!

- Advertisement -

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కు తగ్గట్లు హీరోయిన్స్ ని ఏం అడిగిన చేయకుండా ఉండలేరు. మంచి సినిమా ఆఫ్అర్ ఇచ్చి చెలరేగిపొమ్మని అడగాలే కానీ వెనకడేదేవరు ? ఇప్పుడు ఓవర్ ఎక్స్ పోజింగ్ సెక్సిపోజింగ్ కామన్ చాలా కామన్ అయిపోయాయి. కొందరు బికినీల్లో కూడా రెచ్చిపోతున్నారు. అయితే అదంతా డైరెక్టర్ ని బట్టి ఉంటుంది.

తన సినిమాకు తగ్గట్లు వారు చేయాల్సి వస్తోంది. అయితే ఫిదా బ్యూటీ సాయి పల్లవి మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. రౌడీ పిల్లగా రౌడీ బ్రాండ్ తో పాపులరైన ఈ బ్యూటీ తనకు తానుగానే కొన్ని కండీషన్లు పెట్టుకుని సినిమాల్లో నటిస్తోంది. ప్రేమమ్ – ఫిదా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో ఆ ఇమేజ్ ఇప్పటికీ సాయి పల్లవికి అవకాశాలు తెచ్చి పెడుతోంది. ఇక సాయిపల్లవి డ్యాన్సింగ్ స్కిల్స్ కి యూత్ విపరీతంగా ఫిదా అయిపోతుండడం కూడా అవకాశాలు తెచ్చి పెడుతోందని చెప్పాలి. ఎంతో సహజంగా కనిపిస్తూ పక్కింటి అమ్మాయిలా తన పాత్రలో ఒదిగిపోయే ఈ అమ్మడికి ఓసారి ఓ కొత్త ప్రపోజల్ వచ్చిందట.

ఆ ప్రపోజల్ ప్రకారం.. ఒంటిపై దుస్తుల్లేకుండా చూపించాలి అంటూ ఓ డైరెక్టర్ సూటిగా అడిగాడట. అందుకు తనకు ఇష్టం లేదని ముఖంమీదే చెప్పిందట. “టైట్ ఔట్ ఫిట్స్ ధరించి ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. గతంలో దర్శకులు అలా చేయమని ఒత్తిడి తెచ్చేవారు. కానీ అందుకు కుదరదని చెప్పేసేదానిని“ అని సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఫిదాలో మాత్రం దర్శకుడు సన్నివేశం డిమాండ్ మేరకు ఓ సీన్ లో షార్ట్ డ్రెస్ వేసుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం రానా సరసన విరాటపర్వం చిత్రంలో సాయి పల్లవి నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -