Thursday, April 25, 2024
- Advertisement -

శేఖర్ కమ్ముల తో చైతన్య-పల్లవి

- Advertisement -

శేఖర్ కమ్ముల అంటే ఫీల్ గుడ్ సినిమాలకి పెట్టింది పేరు. ఆయన ఎన్ని సినిమాలు చేసాడు అన్నది లెక్క కాదు కానీ ఆయన చేసిన సినిమాలు ఎన్ని రోజులు జనాలు గుర్తుంచుకున్నారు అనేదే లెక్క. అందుకనే అయన అప్పుడెప్పుడో తీసిన ఆనంద్ ని మనం ఇంకా గుర్తు పెట్టుకున్నాము. ఈ రోజుకి కూడా ఆ సినిమా టీవీ లో వస్తే అంతే రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా రోజుల గాప్ తర్వాత ఫిదా సినిమా తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఆ సినిమా తో సాయి పల్లవి కూడా తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగు పెట్టింది.

ఇక పోతే ఇప్పుడు శేఖర్ కమ్ముల కొత్త వాళ్ళతో ఒక చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశ లో ఉంది. ఇప్పుడు మళ్ళీ సాయి పల్లవి తో ఇంకో సినిమా చేయాలనే దిశగా ప్రయత్నం చేస్తున్నాడు అని టాక్.

అయితే సాయి పల్లవి సరసన ఈ సినిమా లో నాగ చైతన్య కనిపించనున్నాడు అనే టాక్ నడుస్తుంది. ఈ సినిమా కి కథ సిద్ధం గా నే ఉంది కానీ హీరో హీరోయిన్ల డేట్స్ ని బట్టి సినిమా ని త్వరలో ప్రారంభించాలని చూస్తున్నాడు దర్శకుడు. అయితే ప్రస్తుతం వీళ్ళ అందరికీ ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది చెప్పడం కష్టమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -