శ్యామ్, సాయిసుధ కేసులో సంతకాన్ని మార్ఫింగ్.. కొత్త ట్విస్ట్..!

355
Sai Sudha files cheating case against Shyam K Niadu
Sai Sudha files cheating case against Shyam K Niadu

’అర్జున్ రెడ్డి’ సహా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన సాయిసుధ.. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు మేరకు.. విచారణ జరిపిన పోలీసులు శ్యామ్ కె.నాయుడును అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఐతే అరెస్టయిన రెండు రోజులకే బెయిల్ మీద బయటికి వచ్చాడు శ్యామ్.

సాయిసుధతో తాను కాంప్రమైజ్ అయినట్లు పేర్కొంటూ ఇద్దరి సంతకాలతో కూడిన పత్రాలతో పిటిషన్ వేయడంతో నాంపల్లి కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కేసు సద్దుమణిగినట్లే అని.. ఆఫ్ ద కోర్టు ఇద్దరూ సెటిల్ చేసుకోబోతున్నారని అంతా అనుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే ఏంటంటే.. కేసు విషయంలో శ్యామ్తో సాయిసుధ రాజీకి రాలేదని వెల్లడైంది. ఆమె సంతకాన్ని మార్ఫింగ్ చేయడం ద్వారా రాజీ పత్రాలతో నాయుడు బెయిల్ పిటిషన్ వేసినట్టు వెలుగులోకి వచ్చింది. బెయిల్ పిటిషన్ సవాల్ చేస్తూ మరోసారి కోర్టును ఆశ్రయించింది సాయి సుధ.

దొంగ సంతకం పెట్టి బెయిల్ కు తాను ఓకే చెప్పినట్లు శ్యామ్ నకిలీ పత్రాన్ని సృష్టించాడని సాయి సుధ న్యాయ స్థానానికి చెప్పడం తో కోర్టు అతడి బెయిల్ రద్దు చేసింది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు ఒకప్పుడు శ్యామ్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్. పోకిరి దేశముదురు సూపర్ బిజినెస్మాన్ తదితర సినిమాలకు శ్యామ్ కెమెరామన్ గా పనిచేశాడు. ఓ సినిమా షూటింగ్ లో శ్యామ్ తో పరిచయం అయిందని.. తాము ఐదేళ్ళ పాటు సహజీవనం చేశామని సాయి సుధ గతంలో ఇంతకు ముందు చేసిన ఫిర్యాదు లో చెప్పింది.

మూడో పెళ్లికి చేసుకుంటున్న ‘దేవి’ హీరోయిన్..!

జబర్దస్త్ కి నా వల్ల కూడా హైప్ వచ్చింది : అనసూయ

చిరంజీవి, నాగార్జున లపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి..!

మంచు లక్ష్మీ కూతుర్ బర్త్ డే సెలబ్రేషన్స్..!

Loading...