Thursday, April 25, 2024
- Advertisement -

సల్మాన్ తో కలిసి డాన్స్ చేస్తున్న చరణ్, ఎన్టీఆర్..!

- Advertisement -

సినీమా పరిశ్రమలో చాలా మంది బడా హీరోలు ఉన్నారు అందులో బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా ఎలా ఉన్న కలెక్షన్స్ మాత్రం అదిరిపోవాల్సిందే. ఆయన ఇప్పుడు దబాంగ్ డాన్స్ టూర్ పేరుతో పర్యటన మొదలు పెట్టాడు. ముందుగా అరబ్ కంట్రీస్ వెళ్ళి.. ఆ తర్వాత యూఎస్ వెళ్లనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కూడా రానున్నాడు.

ప్రభుదేవా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సోనాక్షి సిన్హా లాంటి తారలు కూడా వస్తున్నారని సమాచారం. ఈ వేడుక నవంబర్ 2 వ తేదీన జరగనుంది. వేదిక దద్దరిల్లేలా డాన్సులు చేయనున్నారు. ఇక సల్మాన్ ఖాన్ దబాంగ్ టూర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా భాగం కానున్నారు. ఈ వేడుకకు అటెండ్ అయి వేదికపై సల్మాన్ ఖాన్ తో కలిసి చిందులేయనున్నారట. సల్మాన్, చరణ్, ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేస్తే వేదిక దద్దరిల్లడం ఖాయం.

అయితే సల్మాన్ ఖాన్ కు ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన చిరంజీవి ఇంటికి వెళ్లి మరి పలకరిస్తారట. ఆ అనుబంధం కారణంగానే సల్మాన్ ఖాన్ హైదరాబాద్ డాన్స్ టూర్ లో రామ్ చరణ్ పాల్గొంటున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -