Thursday, April 25, 2024
- Advertisement -

సల్మాన్ రియల్ హీరో.. 25 వేల మందికి సాయం…!

- Advertisement -

స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే కోట్లల్లో కలెక్షన్స్ వస్తాయి. ఇక సల్మాన్ వ్యక్తిగతంగా చాలా ఎమోషనల్. అందుకే ఆయనకు లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు.

తాజాగా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తన ఛారిటీ సంస్థ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. బాలీవుడ్ షట్ డౌన్ అవ్వడంతో ఐదు లక్షల మంది కార్మికులకు ఉపాధి నిలిచిపోయింది. వారిలో 25 వేల మందికి తీవ్ర ఆర్థిక సమస్య ఏర్పడింది. దాంతో ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ తన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ను రంగంలోకి దింపారు.

బీయింగ్ హ్యూమన్ ప్రతినిధులు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (ఎఫ్ డబ్ల్యూఐసీఈ) కార్యాలయానికి వచ్చి ఆ పాతికవేల మంది కార్మికుల బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నారు. వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయాలన్నది సల్మాన్ ఆలోచన. ఆ పాతికవేల మంది యోగక్షేమాలు లాక్ డౌన్ ఉన్నన్నాళ్లు బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ చూసుకోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -