Friday, April 19, 2024
- Advertisement -

సల్మాన్ ఖాన్ ఇంట విషాదం.. ఏం జరిగింది ?

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. సల్మాన్ కు ఎంతో ఇష్టమైన ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ లంగ్ కాన్సర్ కారణంగా హఠాన్మరణం చెందారు. అబ్దుల్లా ఖాన్ వయసు 38 సంవత్సరాలు. అబ్దుల్లా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందతున్న ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన సల్మాన్, “ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో విషయాన్ని అభిమానులకు చేరవేశారు. అబ్దుల్లా మరణ వార్తను విని ఆయన బోరున విలపించారు.

బాలీవుడ్ ప్రముఖులు అబ్దుల్లా మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. అబ్దుల్లా మంచి బాడీ బిల్డర్. సల్మాణ్ ఖాన్ తో కలిసి చాలా కార్యక్రమాల్లో అబ్దుల్లా పాల్గొన్నాడు. అంతేకాకుండా సల్మాన్, అబ్దుల్లా కలిసే జిమ్ కు వెళ్లేవారు. గతంలో అబ్దుల్లాతో కలిసి జిమ్ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -