Saturday, April 20, 2024
- Advertisement -

హిందీ లో సై రా పరిస్థితి ఏంటి?

- Advertisement -

సై రా నరసింహ రెడ్డి సినిమా యొక్క ట్రైలర్ ఇప్పటికే ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ఎంత గొప్పగా ఉంది అంటే, అన్ని ఇండస్ట్రీ ల్లో ఉండే వాళ్ళు అందరూ దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అయితే ట్రైలర్ ని బాగా కట్ చేయడం తో ఈ సినిమా ఇప్పటికే అందరి దృష్టి ని ఆకర్షించింది. అంతే కాకుండా చిరంజీవి ప్రెజెన్స్ కూడా సినిమా కి చాలా మంచి చేయనుంది.

ఇకపోతే ఈ సినిమా హిందీ లో భారీ ఎత్తున విడుదల కానున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ని హిందీ లో పెద్ద నిర్మాణ సంస్థ విడుదల చేస్తూ ఉండటం తో ట్రైలర్ ని బాగా ప్రమోట్ చేశారు. ఈ ట్రైలర్ కి విశేష స్పందన రావడం తో పాటు అందరూ చిరంజీవి కి బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్టు ట్వీట్స్ కూడా చేశారు.

అంతే కాకుండా సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి హీరోలు కూడా సినిమా ట్రైలర్ గురించి ట్వీట్ చేశారు. అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమా లో ఒక కీలక పాత్ర పోషించడం తో ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని అందరూ నమ్ముతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -