Wednesday, April 24, 2024
- Advertisement -

సల్మాన్ ఖాన్ సినిమా కోసం సురేష్ ప్రొడక్షన్స్

- Advertisement -

ప్రభు దేవా దర్శకత్వం లో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఒక సినిమా లో పని చేస్తున్నాడు. ఈ సినిమా తో సల్మాన్ ఖాన్ మళ్ళీ చుల్ బుల్ పాండే గా పొలిసు అవతారం లో మనకి కనిపించనున్నాడు. ఈ సినిమా నే దబాంగ్ 3. దబాంగ్ సిరీస్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఎంతో ఆసక్తికరం గా మారిన ఈ చిత్రం ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండు ఉంటుంది అనే టాక్ నడుస్తుంది. అయితే ఆసక్తికర అంశాలు ఏంటి అంటే ఈ సినిమా ని హిందీ తో పాటు ఇతర భాషల్లో కి కూడా డబ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ని పాపులర్ నిర్మాణ సంస్థలు డబ్ చేసి విడుదల చేయనున్నాయి. అయితే తెలుగు లో ఈ సినిమా ని సురేష్ ప్రొడక్షన్స్ మన అందరి ముందుకు తీసుకొని వస్తుంది. తెలుగు లో సురేష్ ప్రొడక్షన్స్ కి సల్మాన్ ఖాన్ కి మంచి రాపోర్ట్ ఉండటం తో సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా విడుదల చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయం సల్మాన్ ఖాన్ అధికారికం గా తన పేస్ బుక్ ప్రొఫైల్ లో పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -