Thursday, April 25, 2024
- Advertisement -

మళ్ళీ వెకేషన్ మూడ్ లో సామ్,చై

- Advertisement -

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత మరియు నాగ చైతన్య సినిమాల నుంచి ఏమాత్రం గాప్ దొరికినా వెంటనే ఏదో ఒక ఫారిన్ టూర్ వేసి వస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడు అక్టోబర్ లో వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సామ్ మరియు చెయ్ స్పెయిన్ వెళ్లారు. అక్కడ ఐబీజా లో ప్రస్తుతం వారిద్దరు సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత ఈ నేపద్యంలో పలు ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక సినిమాల పరంగా చూస్తే సమంత, నాగచైతన్య నటించిన ‘మజిలీ’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం సమంత తమిళంలో సూపర్ హిట్ అయిన 96 తెలుగు రీమేక్ లో నటిస్తుంది. శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మరోవైపు నాగచైతన్య విక్టరీ వెంకటేష్ తో నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వెంకీ మామా’ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -