Thursday, April 25, 2024
- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ గురించి సమంత స్పందన… సమంతకు కూడా ఎదురైందా?

- Advertisement -

నో డౌట్…….తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అందులో రెండో మాటకు తావేలేదు. ఇప్పుడు తాజాగా అక్కినేని కోడలు సమంతా రుత్ ప్రభు కూడా ఇదే విషయం చెప్పుకొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం ఇచ్చింది. తడబాటు లేకుండా మాట్లాడేసింది ఈ అక్కినేని వారి కోడలు. కాకపోతే సమంతా మాట్లాడిన కోణం మాత్రం అందరూ అభినందించదగ్గదే.

సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీలలో……. మొత్తం ప్రపంచంలోనే ఏదో ఒకటి ఆశపెట్టి పని చేసుకునువాళ్ళు, చేయించుకునేవాళ్ళు ఎంతమంది లేరు? సినిమా ఇండస్ట్రీ గురించే ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు. నా మొదటి సినిమానే హిట్ అయింది. హీరోయిన్‌గా పేరొచ్చింది. అందుకే ఆ తర్వాత నుంచీ నేను ఎవ్వరినీ అవకాశాలూ అడగలేదు. క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఎప్పుడూ ఎదురుకాలేదు. కానీ క్యాస్టింగ్ కౌచ్ కంటే ఇండస్ట్రీలో చాలా అద్భుతమైన వ్యక్తులున్నారు, క్రియేటివిటీ ఉంది, హార్డ్ వర్క్ ఉంది………. వాటిని గురించి కూడా మాట్లాడండి. ప్రతి ఇండస్ట్రీలోనూ, సమాజంలోనూ బ్లాక్ షీప్స్ ఎప్పుడూ ఉంటారు. నెగిటివ్‌తో పాటు పాజిటివ్ గురించి కూడా మాట్లాడాలి కదా అని చెప్పుకొచ్చింది అక్కినేని కోడలు. సమంతా స్పందనపై సర్వత్రా ప్రశంశలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -