Friday, March 29, 2024
- Advertisement -

బేబీ అక్కినేని, నిర్మాత అక్కినేని గా మారనుందా?

- Advertisement -

ఓ బేబీ సినిమా విజయం సాధించడం తో సమంత ఇప్పుడు హీరోయిన్లు అందరి కన్నా ముందు వరుస లో ఉంది. ఈ సినిమా విజయం సమంత కి చాలా మంచి పేరు తీసుకొని వచ్చింది. ఇక పోతే ఇప్పుడు సమంత తన కెరీర్ లో ప్రయోగాలు చేయడానికి సిద్ధపడుతుంది. ఒకవైపు ప్రయోగాత్మక చిత్రాలు, కథాపరంగా చిత్రాలను చేస్తూ నే మరో వైపు అలాంటి కథల తో వచ్చే వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలని నిర్ణయించుకుందట. అంటే సమంత నిర్మాత గా మారబోతుంది అంట. అయితే ఈ విషయం పాతదే అయినా ఈ సారి మాత్రం తప్పకుండా నిర్మాణం వైపు అడుగులు వేసే పనులు ఆరంభించనట్టు సమంత తెలిపింది.

ఈ ఏడాది చివరి కల్లా ఏదో ఒక ప్రాజెక్ట్ ని సెట్ చేసి నిర్మించాలని సమంత భావిస్తుంది. సాధారణం గా సమంత నిర్మించాలంటే తన కుటుంబం లో నే చాలా మంది నిర్మాతలు ఉన్నారు కానీ సమంత మాత్రం అన్ని పనులు తనే సొంతం గా చేసుకోవాలనే దిశగా అడుగులు వేస్తుందని తెలుస్తుంది. తన సొంత నిర్మాణ సంస్థ ని మొదలు పెట్టి ఈ ఏడాది చివరి కల్లా ఒక సినిమా స్టార్ట్ చేయాలనీ టార్గెట్ అయితే పెట్టుకుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -