Thursday, April 25, 2024
- Advertisement -

స‌మంత యూటర్న్ ప‌ష్ట్‌లుక్ విడుద‌ల‌..

- Advertisement -

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్లో తొలిసారిగా చేసిన పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఆమె ప్రధాన పాత్రలో ‘యు టర్న్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమంత ఓ ట్వీట్ చేసింది. ‘నేను నమ్మిన సినిమా ఇది. సెప్టెంబరు 13న ఈ సినిమా చూసి, మీరు కూడా ఇలానే అభిప్రాయపడతారని ఆశిస్తున్నా’ అని సమంత చెప్పింది.

యూటర్న్ సినిమా మిస్టరీ థ్రిల్లర్ సబ్జెక్ట్. అందుకు తగ్గట్టుగా ఉంది ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగో. కన్నడ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్‌లకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలోనే ఈ సినిమా తమిళంలో కూడా విడుదల కాబోతోంది. ఇందులో భూమిక చావ్లా కూడా ఒక ముఖ్య పాత్రను చేస్తోంది.

యూటర్న్’లో ఆది పినిశెట్టి, రాహుల్, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలను సమంత పూర్తి చేసుకుంది. ‘రంగస్థలం’ తర్వాత సమంత నటిస్తున్న చిత్రం ‘యూటర్న్’. ఈ చిత్రంలో విభిన్నమైన లుక్ లో సమంత కనిపించనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -