Thursday, March 28, 2024
- Advertisement -

స‌మంతా కోసం త‌న చిత్రాన్నే ప‌క్క‌కిపెట్టేసిన శ‌ర్వా

- Advertisement -

యువ కథానాయకుడు శర్వానంద్ ప్రస్తుతం రణరంగం సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు. అయితే శర్వానంద్ ఈ మధ్య 96 సినిమా షూటింగ్ చేస్తూ గాయపడిన సంగతి మనకి తెలిసిందే. అయితే షూటింగ్ కి ఆటంకం కలగకుండా ఉండాలని త్వరగా కోలుకొని శర్వానంద్ తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు. గాయాన్ని లెక్క చేయకుండా శర్వానంద్ మళ్ళీ వర్క్ మోడ్ లోకి వచ్చేసాడు. అయితే శర్వానంద్ ఇప్పుడు షూటింగ్ చేద్దాం అంటే సినిమా లో హీరోయిన్ గా చేస్తున్న సమంత డేట్స్ ఖాళీ లేవట. సమంత ప్రస్తుతం ఫుల్ బిజీ గా ఉందట.ఆగస్టు నెల మొత్తం ఖాళీ లేదని సెప్టెంబర్ నెలలో షూటింగ్ పెట్టుకోమని 96 సినిమా యూనిట్ కి సూచించిందట.

ఇక వేరే ఏ ఆప్షన్ లేక శర్వానంద్ సమంత కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. సమంత సెప్టెంబర్ లో ఎప్పుడు అందుబాటు లో ఉంటె అప్పుడే షెడ్యూల్ వేసుకొని సింగిల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ నడుస్తుంది. ఇక ఈ సినిమా ని తమిళం లో ఎవరైతే దర్శకత్వం వహించారో అతనే తెలుగు లో డైరెక్ట్ చేస్తున్నారు.

96 పూర్తి కాగానే శర్వానంద్ తన కొత్త చిత్రం పైకి ఫోకస్ పెడతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -