Wednesday, April 24, 2024
- Advertisement -

యువ హీరో కి ప్రామిస్ చేసిన సమంత

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం యువ హీరోలు గా చలామణి అవుతున్న వారిలో కాస్తో కూస్తో విజయం అంది పుచ్చుకున్న వాళ్ళ లో నాగ శౌర్య ఒకడు. ఇటీవలే వచ్చిన ఓ బేబీ అనే సినిమా లో నాగ శౌర్య ఒక చిన్న పాత్ర చేసి బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నాగ శౌర్య సాధారణం గా సోలో లీడ్ గా బిజీ గా ఉన్నప్పటికీ తన స్నేహితురాలు నందిని రెడ్డి కోసం ఈ సినిమా లో చిన్న పాత్ర చేసాడు. అయితే అది బాగా రావడం, సినిమా కి హెల్ప్ అవడం, సమంత పాత్ర కి మంచి సపోర్ట్ ఇవ్వడం అంతా బాగా నచ్చి సమంత శౌర్య కి ఒక ప్రామిస్ చేసిందట.

ఏదైనా మంచి కథ ని తీసుకొని వస్తే శౌర్య పక్కన సమంత హీరోయిన్ గా చేయడానికి రెడీ గా ఉంటాను అని ప్రామిస్ చేసిందట. శౌర్య కి కూడా ఈ ప్రపోజల్ బాగా నచ్చింది. కాకపోతే తన పక్కన హీరోయిన్ గా పెట్టుకోవాలా లేదంటే సమంత ని హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా నిర్మించాలా అనే ఆలోచనలో శౌర్య ఉన్నట్టు తెలుస్తుంది. సమంత తో సినిమా నిర్మిస్తే అది ఇంకా పెద్ద ప్లస్ అవుతుంది అని శౌర్య భావిస్తున్నాడట. కానీ ఇంకా ఒక నిర్ణయానికి అయితే శౌర్య రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -