చైతూని ముద్దుపెట్టుకున్న సాయి పల్లవి.. సామ్ కామెంట్స్..!

11042
Samantha Reaction on About Sai Pallavi and Naga Chaitanya Kiss in Love Story movie
Samantha Reaction on About Sai Pallavi and Naga Chaitanya Kiss in Love Story movie

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్మల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఎయ్ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ ను వాలంటైన్స్ డే సందర్బంగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్య మరియు సాయి పల్లవిల లుక్ మరియు సినిమా మేకింగ్ చూస్తుంటే మరో ఫిదాలా ఉంటుందేమో అనిపిస్తుంది.

ఇక ఈ వీడియో చివర్లో చైతూకు సాయి పల్లవి ముద్దు పెట్టడంతో వీడియో మరింత హైలైట్ అయింది. సాయి పల్లవి ముద్దు పెడితే నాగచైతన్య ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకోవడంతో.. అంత ఈ వీడియో గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ వీడియోను ట్వీట్ చేసిన నాగచైతన్య భార్య సమంత చాలా బాగుందంటూ కామెంట్ పెట్టింది. అదే సమయంలో ఆ చివరి షాట్ చూసిన తర్వాత నా తల కొన్ని సెకన్ల పాటు ఆగిపోయినట్లయ్యిందంటూ ఫన్నీగా స్పందించింది. అది లిప్ లాక్ సీన్ కాకున్నా కూడా సమంతను షాక్ అయ్యేలా చేసిందట.

అదే లిప్ లాక్ సీన్ అయ్యి ఉంటే చైతూ.. సాయి పల్లవి లిక్ లాస్ సీన్ చేసి ఉంటే అమ్మడి గుండె జారిపోయేదేమో కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన భర్తను మరో యువతి ముద్దుపెట్టుకుంటే.. ఏ భార్య అయినా ఫీల్ అవుతూనే ఉంటుంది. సమంత కూడా ఒక భార్యనే కదా. అందుకే కాస్త ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైన సినిమా ఫీల్డ్ లో ఇవన్నీ కామన్ అని సమంతకు తెలుసు కాబట్టి అర్దం చేసుకుంది. ఇక ఆ వీడియో మీరు కూడా చూసేయండి.

Loading...