Friday, April 26, 2024
- Advertisement -

వెబ్ సిరీస్ పై రియాక్ట్ అయిన సమంత

- Advertisement -

ఈ మధ్యనే ‘మజిలీ’, ‘ఓ బేబీ’ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో కలిసి స్పెయిన్లో వెకేషన్ లో బిజీగా ఉంది. తాజాగా నాగార్జున మరియు అమల తిరిగి ఇండియా వచ్చేసారు కానీ చై, సామ్ మాత్రం ఇంకా స్పెయిన్ లోనే ఉన్నారు. తన హాట్ పిక్చర్స్ తో సమంత సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈనేపథ్యంలో సామ్ తన తదుపరి ప్రాజెక్ట్ అయిన ఒక వెబ్ సిరీస్ గురించి కూడా మాట్లాడింది. “ది ఫ్యామిలీ మ్యాన్” అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్ పాయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

కానీ సడన్ గా సమంత అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ పైన ఎందుకు మనుసు మళ్లింది అంటే అది హిందీ వెబ్ సిరీస్. అంటే ఈ వెబ్ సిరీస్ తో సమంత హిందీ లో కూడా అడుగు పెట్టబోతోంది. ఒక ప్రముఖ తమిళ్ దర్శకుడు ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ తో సమంత డిజిటల్ ప్లాట్ఫారం పై కూడా తన ప్రతిభ చాటనుంది.ఈ వెబ్ సిరీస్ తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ఈ వెబ్ సిరీస్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఇక సమంత తన తదుపరి సినిమా గురించి కూడా అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -