Thursday, March 28, 2024
- Advertisement -

ఆ హీరోని చూస్తుంటే బాధేస్తోంది – స‌మంత‌

- Advertisement -

హీరోయిన్ స‌మంత స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది, వెలుగుతోంది కూడా. ఆమె పెళ్లికి ముందు న‌టించిన సినిమాలు క‌న్నా పెళ్లి త‌రువాత ఆమె న‌టించిన సినిమాలే ఎక్కువ విజ‌యం సాధించాయి. పెళ్లి త‌రువాత ఆమె న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. అయితే పెళ్లి త‌రువాత ఆమె న‌టించిన ఓ సినిమా విష‌యంలో బాగా ఆప్‌సెట్ అయింద‌ట స‌మంత‌. త‌మిళంలో సూప‌ర్ డీల‌క్స్ అనే సినిమాలో న‌టించింది స‌మంత‌.

ఈ సినిమాలో స‌మంత‌తో పాటు విజ‌య్ సేతుప‌తి, ర‌మ్య‌కృష్ణ వంటి స్టార్స్ కూడా న‌టించారు. విడుద‌లకు ముందు ఈ సినిమా త‌మిళంలో సంచ‌ల‌నం సృష్టించింది. కాని విడుద‌ల త‌రువాత అంచ‌నాల‌ను అందుకోవ‌డం విఫ‌లం అయింది ఈ సినిమా. రిలీజ్ తర్వాత కూడా మంచి రివ్యూలు వచ్చాయి. సినిమా కథ, కథనాలు ఈ సినిమాకు బజ్‌ను తీసుకొచ్చాయి. అయితే సినిమా పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తి చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని, కాని సినిమా ఫ‌లితాన్ని చూసిన త‌రువాత విజ‌య్ సేతుప‌తిని చూస్తుంటే బాధేస్తోందని తెలిపింది స‌మంత‌.

ఈ సినిమా ఫ‌లితం గురించి మాట్లాడుతు … “టుబి ప్రాంక్ గా చెప్పాలంటే …నేను అప్ సెట్ అయ్యాను. సినిమా నిజమైన విజయం..విమర్శకుల నుంచి మాత్రమే కాదు బాక్సాఫీస్ వద్ద కూడా హిట్ కావాలి. ఈ సినిమా ఫ‌లితం విష‌యంలో కాస్తా నిరాశ చెందాన‌ని చెప్పుకొచ్చింది స‌మంత‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -