Tuesday, April 23, 2024
- Advertisement -

2020 తర్వాత సమంత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత అక్కినేని గర్భవతి అంటూ ఈ మధ్యనే కొన్ని పుకార్లు బయటకు వచ్చాయి కానీ ఇప్పటికే చాలాసార్లు ఆ వార్తల్లో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చేసింది. అయితే తాజాగా ఇప్పుడు సమంత పైన మరొక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం తమిళంలో సూపర్హిట్ అయిన ’96’ తెలుగు రీమేక్ షూటింగ్ తో బిజీగా ఉంది సామ్. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత సమంత మరే సినిమాలను సైన్ చేయలేదు. మరోవైపు ఈమె కమర్షియల్ సినిమా అయినా పర్లేదు కానీ తన పాత్రకి ప్రాధాన్యత లేకపోతే సినిమాలు చేయను అంటూ ఖరాకండిగా చెప్పేస్తోంది.

అయితే తాజాగా ఎన్ని సినిమాలు చేసినా కేవలం ఒక సంవత్సరకాలం మాత్రమే ఉందని, ఆ తర్వాత సినిమాలకు సమంత దూరం అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఎప్పుడో ముసలివాళ్ళు అంటే అయిపోయాక పిల్లల్ని కనడం కంటే ఇప్పుడే బెటరని ఆమె నిర్ణయించుకుందట. అందుకే 2020 వరకు సినిమాల్లో నటించి ఆ తర్వాత కొంత కాలం బ్రేక్ తీసుకొని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మళ్ళీ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెడుతుంది అని కొందరు వాదిస్తున్నారు. అయితే ఈ పుకార్లలో ఎంతవరకు నిజం ఉందో మాత్రం ఇంకా తెలీదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -