సేమ్ టూ సేమ్‌… చిరు, చెర్రీ ఒకేలా

477
Same to Same : Ram Charan following Chiranjeevi
Same to Same : Ram Charan following Chiranjeevi

న‌ట‌న‌లోనే కాదు అనుక‌ర‌ణ‌లో… వ‌స్ర్త‌ధార‌ణ‌లోనూ ఇద్ద‌రం సేమ్ టూ సేమ్ అంటున్నారు చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌తేజ్‌. వీరిద్ద‌రూ ఆహార్యంలోనూ ఒకే తీరున క‌నిపించ‌డంతో మెగా అభిమానుల‌కు పండ‌గే. చిరంజీవి.. రామ్‌చ‌రణ్ ఇద్దరూ గడ్డం.. వ‌స్ర్త‌ధార‌ణ ఒకే తీరున వేసుకున్నారు. వీరిద్ద‌రూ ఓ కాఫీ షాప్‌లో కాఫీ తాగుతుంటే క్లిక్ మ‌నిపించారు. ఆ ఫొటోను రామ్ చ‌ర‌ణ్ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. రంగస్థలం 1985 కోసం రామ్ చరణ్ అప్ప‌టి త‌రం మాదిరిగా గ‌డ్డం పెంచాడు. ఇక త‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా అదే మాదిరి గ‌డ్డం పెంచేశారు. ఇలా ఎందుకు ఉన్నారంటే `సైరా` సినిమా కోస‌మ‌ట‌.

రామ్ చరణ్ తన తండ్రిని కాఫీ కోసం బయటికి తీసుకెళ్లాడు. కాఫీ షాప్ లో ఇద్దరూ కలిసి కాఫీ సేవిస్తూ మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో తీసిన ఈ ఫొటో నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. `కాఫీ టైమ్ ఇది. గెడ్డంతో నేను, డాడీ సేమ్ టు సేమ్ కనిపిస్తున్నాం. కాఫీ కోసం బయటకి తీసుకెళ్లడానికి నాన్నని ఒప్పించడం ఆనందంగా ఉంది` అని రాసుకొచ్చాడు చ‌ర‌ణ్‌.

ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌తేజ్ రంగ‌స్థ‌లం 1985 చిత్రంతో వ‌స్తుండ‌గా.. చిరంజీవి సైరా సినిమా కోసం ప‌నిచేస్తున్నారు. ఈ సినిమాను రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తుండ‌డంతో ద‌గ్గ‌రుండి ప‌నులు చూసుకుంటున్నారు. అందుకే అత‌డి సినిమా రంగ‌స్థ‌లం ఆల‌స్య‌మ‌వుతోంది.

Loading...