మ‌ళ్లీ త‌ల్లి కాబోతున్న‌ ఎన్టీఆర్ మాజీ ల‌వ‌ర్‌..ప్రూఫ్ ఇదిగో!

7632
Sameera reddy confirm to 2nd time pregnancy
Sameera reddy confirm to 2nd time pregnancy

హీరోయిన్ స‌మీరా రెడ్డి మ‌ళ్లీ త‌ల్లి కాబోతుందనే వార్త‌ను గ‌తంలోనే ఆద్యా మీడియా ప్ర‌చురించింది. ఈ వార్త ఇప్పుడు నిజం అని స్వ‌యంగా స‌మీరా రెడ్డే వెల్ల‌డించింది. తాను మ‌రోసారి గ‌ర్భం దాల్చ‌న‌ని స‌మీరా రెడ్డి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.తాను గర్భవతి అనే విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోతో పాటు ‘నిన్ను కలుసుకోవాలని ఎదురుచూస్తున్నా బేబీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో త‌న కొడుకు కూడా ఉన్నాడు. ‘మైనే దిల్ తుజ్ కో దియా’ అనే సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది స‌మీరా రెడ్డి. త‌రువాత తెలుగులో ఎన్టీఆర్‌తో క‌లిసి న‌ర‌సింహుడు సినిమాలో న‌టించింది.

ఈ స‌మ‌యంలోనే వీరిద్ద‌రు ప్రేమించుకున్నార‌నే వార్త‌లు వచ్చాయి. ఈ వార్త‌ల‌ను నిజం చేస్తు ఎన్టీఆర్ త‌న త‌రువాత సినిమా అశోక్‌లో కూడా హీరోయిన్‌గా తీసుకున్నాడు. దీంతో వీరు ప్రేమ‌లో ఉన్నార‌ని చాలామమంది నమ్మారు కూడా. అప్ప‌ట్లో ఎన్టీఆర్ ఆమెకు ఓ కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడ‌ని ఇచ్చాడ‌ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఎన్టీఆర్ కూడా ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు అయిన విష‌యాన్ని మ‌ళ్లీ ఎందుకండి గుర్తుకు తెస్తున్నార‌ని అడిగాడు. అయితే వీరి ప్రేమ‌కు మ‌ధ్య‌లోనే బ్రేక్‌లు ప‌డ్డాయి. కారణం తెలియ‌దు కాని వీరిద్ద‌రు మ‌ధ్య‌లోనే విడిపోయారు. 2014లో సమీరా రెడ్డి అక్షయ్ వాద్రా అనే వ్య‌క్తిని వివాహం చేసుకున్నారు. 2015లో ఆమె ఓ మగబిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ స‌మీరా రెడ్డి తల్లి కాబోతుంది.

Loading...