తల్లి కాబోతున్న సమీరా

187

హాట్ భామ సమీరా రెడ్డి తల్లి కాబోతోంది. ఈ సంవత్సరం జనవరి 21న తన ప్రేమికుడు అక్షయ్ వర్దే ని పెళ్లి చేసుకున్న ఈ భామ గత రెండేళ్లుగా అతగాడితో ప్రేమాయణం కొనసాగించి ఈ జనవరిలో పెళ్ళాడింది.

తను తల్లి కాబోతున్న విషయాన్ని సమీరా నే స్వయంగా వెల్లడించింది. వచ్చే మే నెల నాటికి పండంటి బిడ్డ పుడతాడని తెగ సంతోష పడుతోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ తో పాటు దక్షినాది బాషలలో నటించిన ఈ భామ తెలుగులో కూడా నటించింది.

Loading...