అనవసరం గా ఎన్టీఆర్ ని లాగుతున్నారు

304
Sameera Reddy Opens about Sameera - NTR rumours
Sameera Reddy Opens about Sameera - NTR rumours

ఎన్టీఆర్ సమీరా రెడ్డి మధ్య అఫైర్ ఉందని ఒకప్పుడు వార్తలు వచ్చిన దాని గురించి ఇటీవలే సమీరా రెడ్డి స్పందించారు. సమీరా రెడ్డి ఎన్టీఆర్ తో నరసింహుడు, అశోక్ సినిమాలని చేసింది. అయితే ఎన్టీఆర్ తో రిలేషన్ నడిపింది అని వచ్చిన రూమర్స్ పైన ఆవిడ స్పందిస్తూ, “అప్పట్లో నేను తెలుగు సినిమా పరిశ్రమ లో పని చేసేటప్పుడు నాకు ఇంక ఏ హీరో పరిచయం లేకపోవడం తో నేను కొంచెం ఎన్టీఆర్ తో క్లోస్ గా ఉండేదాన్ని. మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరేమి లేదు. కానీ జనాలు మాత్రం మా ఇద్దరి మధ్య ఏదో ఉంది అనుకునేవారు. ఇదే విషయం మా ఇంటి వరకు వెళ్ళింది. మా మధ్య అఫైర్ ఉంది అని అందరూ అనుకోవడం, మా ఇంట్లో వాళ్ళకి తెలియడం, ఆ పై మెల్లగా నేను పరిశ్రమ కి దూరం కావడం జరిగిపోయాయి.” అని సమీరా రెడ్డి చెప్పింది.

అయితే ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఒకవైపు ఎన్టీఆర్ తన జీవితం లో సంతోషం గా ఉన్నాడు. అటువైపు సమీరా రెడ్డి కూడా తన జీవితం లో హాపీ గా ఉంది. కొంత మంది మీడియా వాళ్ళు మాత్రం అనవసరం గా గతాన్ని తొవ్వి ఎన్టీఆర్ పేరు మీడియా లో ఉండే లా చూసి అనవసరం గా రాద్ధాంతం చేస్తున్నారని కొంతమంది అభిమానులు వాదిస్తున్నారు.

Loading...