సెల్ఫీతో ప్ర‌గ్నెన్సీని క‌న్ఫ‌ర్మ్ చేసిన హీరోయిన్‌

809
Sameera Reddy Pregnancy Selfie Viral in Social Media
Sameera Reddy Pregnancy Selfie Viral in Social Media

హీరోయిన్ సమీరా రెడ్డి అంద‌రికి గుర్తు ఉండే ఉంటుంది. బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా కొన్ని సినిమాల‌లో న‌టించింది. తెలుగులో ఎన్టీఆర్ వంటి యంగ్ హీరోతో పాటు, మెగాస్టార్ చిరంజీవి వంటి సీనియ‌ర్ హీరోతో కూడా న‌టించింది. ఎన్టీఆర్‌తో క‌లిసి అశోక్ , న‌ర‌సింహుడు సినిమాల‌లో న‌టించింది. ఎన్టీఆర్ స‌మీరా రెడ్డితో ఎఫైర్ సాగించాడ‌ని అప్పట్లో వార్త‌లు కూడా వ‌చ్చాయి. తెలుగులో పెద్ద‌గా స‌మీరా రెడ్డి స‌క్సెస్ కాలేదు. దీంతో బాలీవుడ్‌లో కొన్ని సినిమాల‌లో న‌టించింది. అక్క‌డ కూడా అవ‌కాశాలు త‌గ్గ‌డంతో ఓ బిజినేస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకుని , త‌న వివాహిత జీవితాన్ని హాయిగా గ‌డుపుతోంది.

ఇప్ప‌టికే ఓ పిల్లాడికి త‌ల్లి అయిన స‌మీరా రెడ్డి , తాజాగా మ‌రోసారి రెండోసారి గ‌ర్భం దాల్చింది. స‌మీరా రెడ్డి రెండోసారి గ‌ర్భ‌వ‌తి కావ‌డంపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఇలాంటి వార్త‌ల‌కు చెక్ పెడుతు తానే స్వ‌యంగా ఓ సెల్ఫీ షోటో తీసి సోష‌ల్ మీడియాలో సోస్ట్ చేసింది. ఈ ఫోటోలో తాను మ‌రి కొద్ది రోజుల్లో ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిబోతున్నానంటూ రాసుకొచ్చింది. మొత్త‌నికి ఓ సెల్ఫీతో రూమార్స్‌కు చెక్ పెట్టింది స‌మీరా రెడ్డి.

Loading...