రెండోసారి గ‌ర్భందాల్చిన ఎన్టీఆర్ మాజీ ప్రియురాలు

767
Sameera Reddy Pregnant with Second Child
Sameera Reddy Pregnant with Second Child

\స‌మీరా రెడ్డి గుర్తుందా? ఎన్టీఆర్‌తో రెండు సినిమాల‌లో న‌టించింది. న‌ర‌సింహుడు,అశోక్ సినిమాల‌లో హీరోయిన్‌గా ఎన్టీఆర్‌తో న‌టించింది ఈ భామ‌. ఈ స‌మ‌యంలో స‌మీరా రెడ్డితో ఎన్టీఆర్ ప్రేమలో ఉన్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో ఎన్టీఆర్ ఆమెకు ఓ కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడ‌ని ఇచ్చాడ‌ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఎన్టీఆర్ కూడా ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు అయిన విష‌యాన్ని మ‌ళ్లీ ఎందుకండి గుర్తుకు తెస్తున్నార‌ని అడిగాడు. అయితే వీరి ప్రేమ‌కు మ‌ధ్య‌లోనే బ్రేక్‌లు ప‌డ్డాయి. కారణం తెలియ‌దు కాని వీరిద్ద‌రు మ‌ధ్య‌లోనే విడిపోయారు. చిరంజీవితో క‌లిసి జైచిరంజీవా సినిమాలో కూడా న‌టించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. అయితే ఈ స‌మ‌యంలో స‌మీరాకు బాలీవుడ్‌లో అవ‌కాశాలు రావ‌డంతో అక్క‌డు వెళ్లిపోయింది.

అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా మారింది. సినిమాల్లో ఆఫ‌ర్లు త‌గ్గిపోవ‌డంతో 2014లో అక్షయ్ వర్ధే అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉంటుంది స‌మీరా. ఈ జంటకు ఆ మ‌ధ్య ఓ బాబు కూడా పుట్టాడు.తాజాగా ఆమె రెండోసారి గ‌ర్భం దాల్చిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవవ‌ల కాలంలో స‌మీరా ఎక్క‌డ బ‌య‌ట పెద్ద‌గా క‌పించ‌లేదు. తాజాగా ల‌క్మే ఫ్యాష‌న్ వీక్ సంద‌ర్భంగా ఫోటోల‌కు పోజులిచ్చింది స‌మీరా రెడ్డి. బాగా బ‌రువు పెరిగిపోయింది. దీంతో ఆమె మ‌ళ్లీ గ‌ర్భం దాల్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.స‌మీరాను చూసి అభిమానులు గుర్తు ప‌ట్ట‌లేక‌పోతున్నారు. మ‌రి ప్ర‌గ్నెన్సీ వార్త‌ల‌పై స‌మీరా రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Loading...