23లోకే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నా : సంపత్ రాజ్

3803
Sampath raj Shocking Comments On His Ex Wife
Sampath raj Shocking Comments On His Ex Wife

టాలీవుడ్ లో ప్రభాస్ నటించిన మిర్చి మూవీ నుంచి విలనిజం స్టైల్ మారింది. డిఫరెంట్ విలనిజం మిర్చిలో కనిపిస్తోంది. ఏ హీరోకైన సరైన విలన్ గా నటుడు సంపత్ రాజ్ సరిపోతారు. టాలీవుడ్ లో ఇప్పటికే అందరి స్టార్ హీరోల సినిమాలో విలన్ గా కనిపించాడు సంపత్. సంపత్ రాజ్ అంటే అందరికీ ముందుగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి సినిమానే గుర్తొస్తుంది.

ఆ సినిమాలో “నువ్వు చెప్పిన మగతనం నేను ట్రై చేస్తా. నేను చెప్పిన మగతనం ట్రై చేస్తావా” “రారా మగాడా..” అంటూ ఆయన డైలాగులు ఓ మార్క్ సృష్టించాయి. అయితే సినిమా లైఫ్ పరంగా సంతోషంగా ఉన్న సంపత్.. వివాహ జీవితంలో మాత్రం విడాకులు తీసుకోవాల్సి వచ్చిందట. ఈ విషయంను ఆయనే చెప్పాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చాడు. నాకు 23యేళ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాను. ఆ టైంలో నా భార్యకి 19యేళ్లు. పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలానికి ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడం.. తరచూ వాదించుకోవడం జరుగుతుండేవి. ఇక చివరికి మా ఇద్దరి లక్ష్యాలు వేరని అర్ధం చేసుకొని విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాము. అప్పటి నుండి వేరువేరుగా ఉంటున్నాం.

కానీ మాకు ఓ కూతురు కూడా ఉంది. నా కూతురు నా దగ్గరే ఉంటుంది. ఇక మేం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. నా కూతురు అప్పుడప్పుడు వాళ్ల అమ్మను చూడటానికి వెళ్తుంది. నేను కూడా ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటాను. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు విబేధాలు లేవు” అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. సంపత్ ప్రస్తుతం తెలుగు తమిళ కన్నడ బాషలలో కొన్ని సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు.

Loading...