Saturday, April 20, 2024
- Advertisement -

డ్యాన్స్ మాస్ట‌ర్‌తో ప్రేమ‌లో ప‌డ్డ హీరోయిన్‌

- Advertisement -

హీరోయిన్ స‌న ఖాన్ గుర్తుందా..? మ‌న తెలుగులో కూడా ఈ భామ కొన్ని సినిమాల్లో న‌టించింది. నాగ‌ర్జున న‌టించిన గ‌గ‌నం, కళ్యాణ్ రామ్ న‌టించిన కత్తి , మంచు మ‌నోజ్ న‌టించిన మిస్టర్ నూకయ్య వంటి సినిమాల్లో న‌టించింది స‌న ఖాన్‌. తెలుగులో ఆమె న‌టించిన సినిమాలు ఏమి కూడా స‌క్సెస్ సాధించ‌క‌పోవ‌డంతో ఇక్క‌డ పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది అక్క‌డ మాత్రం బాగానే అవ‌కాశాలు వ‌చ్చాయి.

ఈ స‌మయంలోనే బాలీవుడ్ ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్‌తో మెల్విన్ లూయిస్‌తో ప్రేమ‌లో మునిగిపోయింది. తాజాగా మెల్విన్ పుట్టిన రోజు సందర్బంగా ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. నీతో ఉన్న అనుబంధం నీపై ఉన్న ప్రేమను చెప్పేందుకు నాకు నా వద్ద ఉన్న పదాలు సరిపోవడం లేదు. నేను సూపర్ లక్కీ ఎందుకంటే నువ్వు నాకు లభించడం చాలా థ్యాంక్స్ నన్ను నీ లవ్ గా ఎంపిక చేసుకున్నందుకు ఐలవ్ యూ. హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ పోస్ట్ చేసింది.దీంతో వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని క‌న్ఫ‌ర్మ్ చేసింది స‌న ఖాన్‌.

2012లో బిగ్‌బాస్ ద్వారా వెలుగులోకి వ‌చ్చింది స‌న ఖాన్‌. బిగ్‌బాస్ ద్వారా వ‌చ్చిన ఫేమ్‌తో బాలీవుడ్‌లో అవ‌కాశాలు ద‌క్కించుకుంది. ఇక మెల్విన్ కూడా కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అతి త్వ‌ర‌లోనే వీరి పెళ్లి చేసుకోనున్నార‌ని వారి స‌న్నిహితులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -