Thursday, April 25, 2024
- Advertisement -

సందీప్ రెడ్డి ని హోల్డ్ లో పెట్టిన అర్జున్ రెడ్డి

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమా తో పెద్ద విజయం సాధించిన సందీప్ రెడ్డి వంగా, తన తదుపరి చిత్రాన్ని కూడా హిందీ లో చేసాడు. ఇదే సినిమా ని హిందీ లో తీసి అక్కడ కూడా సంచలనం సృష్టించాడు. సందీప్ రెడ్డి తీసిన ఈ సినిమా హిందీ లో కబీర్ సింగ్ గా విడుదల అయ్యి మొదటి రోజు దాదాపు గా 22 కోట్లు సంపాదించింది. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి తదుపరి చిత్రం ఏంటి అని సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యం లో ఆయన మరలా విజయ్ దేవరకొండ తో పని చేస్తాడు అనే వార్తలు బయటకు వస్తున్నాయి.

అయితే తన తదుపరి చిత్రం లో కూడా సందీప్ రెడ్డి విజయ్ దేవరకొండ ని ఇంకొక స్ట్రాంగ్, రెబల్ పాత్ర లో చూపించాలి అని అనుకుంటున్నాడట. అయితే విజయ్ దేవరకొండ తో కథా చర్చలు ఇప్పటికే మొదలు పెట్టిన సందీప్ త్వరలో నే ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు వస్తాయి. అయితే జులై లో విజయ్ కొత్త చిత్రం డియర్ కామ్రేడ్ విడుదల అవుతుంది. ఇది అవ్వగానే విజయ్ ఈ కొత్త చిత్రానికి అంగీకారం తెలుపుతాడట.

త్వరలో నే ఈ సినిమా పైన ఒక అధికారిక క్లారిటీ రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -