Saturday, April 20, 2024
- Advertisement -

సూపర్ స్టార్ తో నే సందీప్ రెడ్డి సినిమా, కానీ…

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు పరిశ్రమ లో కి అడుగు పెట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా ని బాలీవుడ్ కి కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కబీర్ సింగ్ గా తీసాడు సందీప్. ఈ రెండు సినిమాలు అటు తెలుగు లో ఇటు హిందీ లో ఘానా విజయం సాధించాయి. నిజానికి సందీప్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా జరుగలేదు. అప్పుడే సందీప్ కి బాలీవుడ్ అవకాశం వచ్చింది. కబీర్ సింగ్ అయ్యాక అయినా సందీప్ తెలుగు సూపర్ స్టార్ తో పని చేస్తాడు అని అంతా అనుకున్నారు కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఇప్పుడు అది కుదిరేలా లేదు.

కాకపోతే సందీప్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా ని సూపర్ స్టార్ తో నే చేస్తున్నాడు. తేడా ఏంటి అంటే తెలుగు సూపర్ స్టార్ బదులు హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో పని చేస్తాడట. సల్మాన్ ఖాన్ ని ప్రధాన పాత్రలో ఊహించుకుంటూ సందీప్ ఒక కథ చెప్పాడట. అది సల్మాన్ కి బాగా నచ్చి నిర్మించడానికి ముందుకు వచ్చాడని టాక్. ఇందులో సల్మాన్ హీరో గా కూడా నటించనున్నాడట. కథా చర్చలు ఇంకా సాగుతున్నాయి. సినిమా కి సంబందించిన వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -