అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడితో యంగ్ టైగ‌ర్‌

1503
Sandeep Reddy Vanga to make another Arjun Reddy with Jr NTR?
Sandeep Reddy Vanga to make another Arjun Reddy with Jr NTR?

అర్జున్ రెడ్డి తెలుగు సినిమా స్థితి గ‌తిని మార్చేసిన సినిమా. నాగ‌ర్జున న‌టించిన శివ త‌రువాత మ‌ళ్లీ తెలుగు సినిమాల‌లో ట్రెండ్ సెట్ సినిమా అంటే అర్జున్ రెడ్డే అని చెప్పాలి. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ఈ సినిమాకు సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.గ‌త సంవ‌త్స‌రం విడుద‌లైన ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సందీప్ రెడ్డికి చాలానే అవ‌కాశాలు వ‌చ్చాయి. ఆ మ‌ధ్య మ‌హేశ్ బాబుకి ఓ క‌థ వినిపించి ఓకే చేయించుకున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి.

కాని మహేశ్‌తో సినిమా చేయ‌లంటే మినిమ‌మ్ ఒక సంవ‌త్స‌రం అయిన వెయిట్ చేయాలి. అప్ప‌టికి అయిన సినిమా చేస్తాడా అంటే అనుమాన‌మే.దీంతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేశాడు సందీప్‌. ఎన్టీఆర్‌ను క‌లిసి ఓ క‌థ‌ను వినిపించాడ‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు క‌థ న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వ‌గానే సందీప్‌తో సినిమా చేయ‌నున్నాడు ఎన్టీఆర్‌. అటు సందీప్ కూడా అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ రీమేక్ చేస్తున్నాడు. ఈలోపు ఈ సినిమాను పూర్తి చేసి ఎన్టీఆర్ కోసం రెడీ ఉంటాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా అంటే మ‌రో అర్జున్ రెడ్డిని ఊహించుకుంటున్నారు అభిమానులు.