Friday, April 19, 2024
- Advertisement -

సంగీతకు లైన్ వేసిన శేఖర్ మాస్టర్.. రోజా ఫైర్..!

- Advertisement -

బుల్లితెరపై చాలా షోస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. ఈ షోలో కొందరు కెమిస్ట్రీని బాగా పండిస్తున్నారు. ముఖ్యంగా రష్మీ సుధీర్ జంట కెమిస్ట్రీ పండించడం మనం చాలా సార్లు చూశాం. శేఖర్ మాస్టర్ రోజాది కూడా కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. మాములుగా బుల్లితెరపై పండగలకు స్పెషల్ షోస్ చేస్తూ ఉంటారు. అందులో శేఖర్ మాస్టర్ కు సపరేట్ ట్రాక్ ఉంటుంది.

కానీ ఈ దసరా ఈవెంట్‌కు రోజా దూరంగా ఉండిపోయింది. ఆమె స్థానంలో నటి సంగీత వచ్చారు. సంగీతకు తెలుగు అంతగా రాదు. తాజాగా ఈవెంట్ మొత్తం ఆమె చూట్టునే తిరిగినట్లు అనిపిస్తోంది. అక్కా ఎవరే అతగాడు అంటూ తన చెల్లెల్లకు (వర్షిణి, రష్మీ) పెళ్లి చేసేందుకు అక్క అయిన సంగీత పడే పాట్లే ఈ ఈవెంట్ నేపథ్యమని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌తోనే శేఖర్ మాస్టర్ కూడా ఉన్నాడు. అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ వేయడమే కాకుండా వచ్చీ రావడంతో సంగీతపై కన్ను వేశాడు.

వెంటనే ఆమెతో పులిహోర కలపడం మొదలు పెట్టాడు. మీకు పెళ్లైందా అని సంగీతని శేఖర్ మాస్టర్ కొట్టేగా అడగటంతో ఆమె షాక్ అయ్యి ఏంటి అని బెదిరించింది. వెంటనే తడుముకున్న శేఖర్ మాస్టర్.. పూజ ఇంకా చేశారా లేదా అని టాపిక్ డైవర్ట్ చేశాడు. ఇక వెంటనే బ్యాక్ గ్రౌండ్‌లో ‘నీ వయసెంత నువ్ చేసే పనులెంత సిగ్గనిపించడం లేదా నీకు’ అంటూ రోజా వాయిస్ వినబడటంతో శేఖర్ మాస్టర్ దెబ్బకు షాక్ అయ్యాడు. అలా సరదాగా సాగింది.

పవన్ కళ్యాణ్ తన సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెట్టాడే..?

శాకుంతలం తర్వాత గుణశేఖర్ సినిమా అదే..?

వకీల్ సాబ్ షూటింగ్ పై క్లారిటీ వచ్చినట్టేనా..?

రవితేజ ఆ కథను ఒప్పుకున్నాడా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -