Saturday, April 20, 2024
- Advertisement -

బ‌యోపిక్ టీజ‌ర్‌ : సంజ‌య్‌ని దించేసిన ర‌ణ్‌బీర్‌

- Advertisement -

బాలీవుడ్‌లో మ‌రో బ‌యోపిక్ విడుద‌లకు రంగం సిద్ద అయింది.అసలు బ‌యోపిక్ పుట్టింది కూడా బాలీవుడ్‌లోనే.సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ జీవితగాథను సంజు పేరుతో దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సంజయ్‌ దత్ పాత్ర‌ను యంగ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ మరియు టీజర్‌లు విడుదల చేశారు చిత్ర యూనిట్.సంజయ్ లుక్‌లో ర‌ణ్‌బీర్ ఇర‌గ‌దీశాడనే చెప్పాలి.

సంజ‌య్ తొలినాళ్ల నుంచి ఇప్పటిదాకా  జీవితంలో ఎదుర్కున్న పరిస్థితులను మొత్తం చూపించేశారు. సినీ కెరీర్‌ మొదలు.. వ్యక్తిగత జీవితం, డ్రగ్స్‌ అలవాట్లు, జైలు జీవితం తదితర అంశాలను చూపించేశారు. సంజ‌య్ లుక్ కోసం ర‌ణ్‌బీర్ బాగానే క‌ష్ట‌ప‌డిన‌ట్లు ఈ టీజ‌ర్‌ను చూస్తంటే అర్థం అవుతుంది.అనుష్క, సోనమ్‌ కపూర్‌, మనీషా కోయిరాల, పరేష్‌ రావెల్‌ తదితరులు కీలక పా​త్రల్లో కనిపించబోతున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -