Friday, March 29, 2024
- Advertisement -

‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ మూవీ రివ్యూ!

- Advertisement -
sapthagiri express movie review

దర్శకుడు కావలని పరిశ్రమకు వచ్చి.. అనుకోకుండా స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. కమెడియన్ గా కొనసాగుతునే.. ఇప్పుడు హీరో కూడా అయ్యాడు. సప్తగిరి హీరోగా చేసిన సినిమా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’. అరుణ్ పవార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

సప్తగిరి (సప్తగిరి) సినిమాలోకి వెళ్లాలని… పెద్ద నటుడవ్వాలని కలలగంటూ ఉంటాడు. సప్తగిరి తండ్రి ఓ కానిస్టేబుల్. సప్తగిరి తండ్రి మాటలు వినకుండా సినిమా కలలుగంటూ తిరుగుతుంటాడు. అలాంటి సయంలో ఓ కష్టం రావడం వల్ల సప్తగిరి తన సినిమా లక్ష్యాన్ని పక్కనబెట్టి పోలీస్ జాబ్ లో చేరుతాడు. అలా పోలీస్ అయిన సప్తగిరి ఆ ఉద్యోగంలో నానా కష్టాలు పడుతుంటాడు. అలాగే తన కుటుంబంని ఓ కష్టం వస్తుంది. దానికి కారణం ఎవరో తెలుసుకుని వాళ్ళను అంతం చేయాలని ప్రయత్నిస్తాడు. అయితే సప్తగిరి ఫ్యామిలీకి వచ్చిన కష్టం ఏంటి? ఆ కష్టానికి కారణాలు ఏంటి? సప్తగిరి చివరి ఏం చేసాడు అనేది ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది హీరో సప్తగిరి గురించి. తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ లో పరశురాముడి వేషంలో సప్తగిరి చాలా బాగా నటించాడు. పరశురాముడి వేషధారణలో హావభావాలను ఆకర్షణీయంగా పలికించిన సప్తగిరి డైలాగులను అదిరిపోయే రెంజ్ లో చెప్పాడు. అలాగే తండ్రి ముందు తన నటనా ప్రతిభను చూపేటప్పుడు చెప్పే దుర్యోధనుడి డైలాగ్ కూడా చాలా ప్రభావవంతంగా చెప్పి ఈలలు వేయించాడు. ఇక ఫస్టాఫ్, సెకండాఫ్ లలో కానిస్టేబుల్ కాణిపాకం(షకలక శంకర్) పై నడిచే కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి. సెకండాఫ్ లో కానిస్టేబుళ్ల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయి అనేది బాగా చూపారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కామెడీ సీక్వెన్స్ ఒకటి సెకండాఫ్ మొత్తానికి హైలెట్ గా నిలిచి బాగానే నవ్వించింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో వచ్చే చిన్నపాటి ట్విస్టులు కాస్త థ్రిల్లింగా అనిపించాయి. ఇక మొదటిసారి హీరోగా చేసిన సప్తగిరి కామెడీతో పాటు కొన్ని ఎమోషనల్, సీరియస్ సన్నివేశాల్లో బాగా నటించి ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ సంగతికి వస్తే.. ఫస్టాఫ్ కంప్లీట్ అయ్యకక్ కానీ అసలు కథ మొదలు అవ్వదు. ఫస్టాఫ్ మొత్తంలో సప్తగిరి డైలాగ్ సీన్స్ మినహాయిస్తే.. మిగిత సీన్స్ పెద్దగా చెప్పుకోవడానికి లేవు. ఇక సినిమా మొత్తంగా హీరో, హీరోయిన్ ల మధ్య వచ్చే లవ్ సీన్స్ బోర్ కొట్టించేలా ఉంది. కొన్ని చోట్ల కథలో ఉన్న దమ్ము మిస్సయింది. ఇక పాటలు మరింత బోరింగ్‍గా ఉన్నాయి.

మొత్తంగా:

స్టార్ కమెడియన్ సప్తగిరికి హీరోగా ఈ ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ గొప్ప ఆరంభం కాదనే చెప్పాలి. ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు.. అక్కడ అక్కడ కామెడీ… ఇంటర్వెల్… క్లైమాక్స్ వంటివి ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగ.. ఇక చాలా వరకు ఫస్ట్ బోరింగ్ నడవటం.. కథలో దమ్ము లేకపోవడం.. బోరింగ్ ఉన్న పాటులు.. ఇవ్వన్ని సినిమా మైనస్ పాయింట్లుగా ఉన్నాయి. సో మొత్తంగా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ లో కామెడీ ఉందని వెళ్లిన వారికి నిరుత్సాహాన్నే మిగులుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -