Friday, April 19, 2024
- Advertisement -

దీపావళికి ’సరిలేరు నీకెవ్వరు’ మహేష్ లుక్..!

- Advertisement -

మహేష్ బాబు హీరోగా రష్మీక హీరోయిన్ గా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకేవ్వరు. ప్రస్తుతం శరీవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక కొత్త అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లును రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలను పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలానే ఫస్ట్ లుక్స్ వచ్చాయి. ఇక పోతే ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది.

ఆమెకు సంబంధించి ఫస్ట్ లుక్ దీపావళి కానుకగా ఈ రోజు రిలీజ్ చేశారు. ఆమె లుక్ చాలా కూల్ గా ఓ ఆఫీసర్ లాగా ఉంది. ఆమె భారతి అనే పాత్రలో కనిపించనుందని చిత్ర యూనిట్ రివీల్ చేసింది. దాంతో సినిమాపై మరింత అంచనాలు పేరిగాయి. ఇక మహేష్ బాబుకు సంబంధించి మరో లుక్ ను దీపావళి కానుకగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఇంతకు ముందు ఆర్మీ ఆఫీసర్ గా కశ్మీర్ దగ్గర్లో పోస్టర్లు… కొండ రెడ్డి బురుజు దగ్గర ఓ పోస్టర్ రిలీజ్ చేయగా.. తాజాగా ఓ గొడవ జరుగుతున్న ప్లేస్ లో బూల్లెట్ బైక్ మీద నుంచి వెళ్తున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహేష్ ఈ పోస్టర్ లో కొత్తగా కనిపిస్తున్నారు. ఇక కశ్మీర్ నుంచి ఆంధ్రకు మహేష్ ఎందుకు రావాల్సి వచ్చింది. అతనుకు ఎదురైన సమస్యలు ఏంటి.. వాటికి ఎలాంటి సోలుషన్ ఇచ్చాడు అనే కథగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -