మ‌హేష్ బాబు సినిమాలో చాన్స్ కొట్టేసిన క‌న్న‌డ బ్యూటీ ..

160
Sarileru Neekevvaru: Rashmika Mandanna joins Mahesh Babu in Sarileru Neekevvaru
Sarileru Neekevvaru: Rashmika Mandanna joins Mahesh Babu in Sarileru Neekevvaru

క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న టాలీవుడ్ లో టాప్ పోజీష‌న్‌లో ఉన్న హీరోయిన్‌. ఆమె డేట్స్ కోసం చాలా మంది నిర్మాత‌లు వేయిట్ చేస్తున్నారు. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండో సినిమాతో గీత గోవిందంతో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా వందకోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోవడంతో రష్మికకు ఛాన్స్ దక్కింది. స్టార్ హీరోలంతా మ‌న సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ఉత్సాహ ప‌డుతున్నారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది.

దీంతో పాటు చేసిన దేవదాస్ బాగుంది అనిపించింది. డియర్ కామ్రేడ్ సినిమా వ‌చ్చే నెల్లో విడుద‌ల కానుంది. మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరూ లో మొదట రష్మికను తీసుకోవాలని అనుకున్నారు. రష్మికను అడిగితె.. నితిన్ తో భీష్మ, తమిళంలో కార్తికేయన్ తో సినిమా చేస్తుండటంతో..ఏం చేయలేక నో చెప్పింది.

తమిళంలో శివ కార్తికేయన్ సినిమా ఒప్పుకోవడంతో మహేష్ సినిమాకు డేట్స్ లేవని చెప్పిందట. దీంతో దర్శకనిర్మాతలు మరో ఆప్షన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అయితే ఆసినిమాలో రష్మిక రోల్ ను బాగా తగ్గించి, కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితం చేశారట. ఇది తెలుసుకున్న రష్మిక సినిమానుంచి తప్పుకుంది. అప్పటికి సరిలేరు నీకెవ్వరూ హీరోయిన్ బెర్త్ ఖాళీగా ఉండటంతో వెంటనే బుక్ చేసుకుంది. అలా ప్రిన్స్ సూపర్ స్టార్ సినిమాలో అవకాశం దక్కించుకుంది రష్మిక.

Loading...