Thursday, April 25, 2024
- Advertisement -

సరిలేరు నీకెవ్వరు టీజర్.. హైలైట్స్ ఇవే..!

- Advertisement -

సంక్రాంతి పండుగ అంటే కోళ్ల పందేలు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్‌కు పోటీగా పెద్ద హీరోల సినిమాలు బరిలోకి దిగడం ఆనవాయితి. అయితే ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పోటీపడేందుకు సిద్దపడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దూకుడు మీదున్నాడు. భరత్ అనే నేను, మహర్షి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ పని పట్టిన మహేష్.. మరోసారి దాడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ ఏడాది సంక్రాంతిబరిలోకి దిగిన పెద్ద చిత్రాలను వెనక్కునెట్టి మరీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఎఫ్2. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్2 రికార్డుల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. దాంతో సరిలేరు నీకెవ్వరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లు, టీజర్ లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ టీజర్ వచ్చింది.

టీజర్ లో ” మీరెవరు మాకు తెలీదు.. మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు.. కానీ మీ కోసం మీ పిల్లల కోసం పగలు రాత్రి ఎండా వానా..అని లేకుండా పోరాడుతూనే ఉంటాం.. ఎందుకంటే మీరు మా బాధ్యత.. మీరంతా మేము కాపాడుకునే ప్రాణాలురా.. మిమ్మల్ని ఎలా చంపుకుంటామురా, భయపడే బేరానికొస్తాడు.. మన దగ్గర బేరాలేవ్వమ్మా.. అనే పవర్‌ఫుల్ డైలాగ్‌లతో” మహేష్ విశ్వరూపం చూపించాడు.

విజయశాంతి ఎమోషనల్‌గా చెప్పిన గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు అనే డైలాగ్.. ప్రకాశ్ రాజ్ చెప్పిన .. ప్రతీ సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు..అనే ఎండింగ్ డైలాగ్ అదిరిపోయింది. మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -