Friday, April 19, 2024
- Advertisement -

“సరిలేరు నీకెవ్వరు” మూవీ రివ్యూ

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా వరుస సక్సెస్ లను అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

అజయ్ కృష్ణ(మహేష్ బాబు) ఆర్మీలో మేజర్ గా ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల అతను ఆంధ్రప్రదేశ్ కర్నూల్ కు రావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సంస్కృతి (రష్మికా మందన్నా) పరిచయం అవుతుంది. రష్మీక ఫ్యామిలీకి కర్నూల్ లో ఉన్న విజయశాంతికి ఏమన్నా సంబంధం ఉందా ? విజయశాంతి (భారతి) మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య గొడవకు కారణం ఏంటి ? అసలు వీరిద్దరి మధ్యలోకి మహేష్ బాబు ఎందుకు వస్తాడు ? అనే ప్రశ్నలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా చేయడం మరో ఎత్తు. చాలా తక్కువ టైంలో ఈ సినిమాని కంప్లీట్ చేసి భారీ హైప్ ను క్రీయేట్ చేసి సినిమాని రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాని తెరకెక్కించారు అనిల్. సినిమా మొదలు అయ్యి ఆర్మీ ఎపిసోడ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ ఎపిసోడ్ వరకు అద్భుతమైన స్క్రీన్ ప్లే తో మంచి ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించాడు.

ఫస్ట్ ఆఫ్ లో వచ్చే డాండ్ డాండ్ సాంగ్ లో మహేష్ అదిరిపోయే స్టేపులు వేశాడు. మహేష్ డాన్సులకు థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. అలానే సెకాండాఫ్ లో మైండ్ బ్లాక్ సాంగ్ కు అదే రెంజ్ లో రెచ్చిపోయారు. ఇక ఫస్ట్ ఆఫ్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ లోని కొండారెడ్డి బురుజు సీన్ తో మరోసారి మహేష్ హిస్టరీ తిరగరాసేలా సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. అలానే విజయశాంతి మరియు మహేష్ బాబుల మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. అలానే మహేష్ మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఉన్న కొన్ని కీలకమైన సీన్స్ ను అయితే అనీల్ చాలా చక్కగా హ్యాండిల్ చేసారని చెపొచ్చు. ఫస్ట్ ఆఫ్ లో కామెడీ పంచి.. యాక్షన్ చూపించిన అనీల్.. సెకండాఫ్ లో కూడా అలాగే మైంటైన్ చేసుకొని వచ్చారు.

తన స్క్రీన్ ప్లే తో ఎంటర్టైనింగ్ చూపించాడు. మహేష్ పెర్ఫామెన్స్ అద్భుతం అని చెప్పాలి. ఈ సినిమాతో కొత్త మహేష్ ని చూడొచ్చు. ఎప్పుడో “ఖలేజా”లో చూసిన కామెడీ యాంగిల్ కానీ సరికొత్త బాడీ మాడ్యులేషన్ కానీ తప్పకుండా ఆకట్టుకుంటాయి. ఇక హీరోయిన్ రష్మీక అద్భుతంగా నటిచింది. అలానే డాన్స్ లో కూడా ఇరగదీసింది. విజయశాంతి ఎన్నో ఏళ్ల గ్యాప్ ఇచ్చినా “బాస్ ఈజ్ బ్యాక్” అన్నట్టు లేడీ అమితాబ్ ఈజ్ బ్యాక్ అనేలా పెర్ఫామ్ చేసారు.

ఇక సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన క్యామియో రోల్ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక ప్రకాశ్ రాజ్ మరోసారి విలన్ గా బాగా నటించారు. ట్రైన్ సీన్లో బ్లేడ్ తో బండ్ల గణేష్ కాసేపే కనిపించినా ఆయన ట్రాక్ లో అదిరిపోయే కామెడీ చేసారు. అలానే నటి సంగీత చాలా కాలం తర్వాత ఓ మంచి పాత్ర పోషించారు. మరో కీలక పాత్రలో నటించిన సత్యదేవ్ తనదైన ఈజ్ నటన కనబర్చారు. వెన్నెల కిషోర్, పోసాని, రావు రమేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక దర్శకుడు కామెడీ మేనరిజంలతో పాటుగా మహేష్ లోని కామెడీ యాంగిల్ ను మరోసారి అద్భుతంగా చూపించారు. యాక్షన్ సిన్స్ కూడా బాగా తెరకెక్కించాడు.

ఈ సినిమాతో మళ్లీ మహేష్, అనిల్ కాంబోలో ఇంకో సినిమా రావాలి అని ఫ్యాన్స్ కోరుకుంటారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ప్రధానమైన ప్లస్ పాయింట్. సాంగ్స్ అన్నీ ఒకెత్తు అయితే మాస్ మరియు ఎమోషనల్ సీన్స్ లో అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు అని చెప్పాలి. ఇంటర్వెల్ బ్లాక్ లో ఇచ్చిన స్కోర్ అయితే మాములుగా ఉండదు.ఇక కెమెరామెన్ రత్నవేలు పనితనం ప్రతీ ఫ్రేమ్ లో మనం ఎంజాయ్ చెయ్యొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : ఉహిచగలిగే కథ.. సెకండాఫ్ లో కాస్త నిడివిడి ఎక్కువైంది.

మొత్తంగా : ఫైనల్ గా చూస్తే.. మహేష్, అనిల్ ల కాంబోలో వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” ఈ సంక్రాతికి మరో పెద్ద పండగ అని చెప్పాలి. అనీల్ మార్క్ కామెడీ, మహేష్ మాస్ ఎలివేషన్ సీన్స్.. వాటికి తగ్గట్లే బ్యాక్ గ్రౌండ్ స్కోర్లు.. స్క్రీన్ ప్లే అన్ని అద్భుతం అని చెప్పాలి. తెలిసిన కథ అయిన దాని మలిచిన విధానం చాలా బాగుంది. మహేష్ ఫ్యాన్సే కాదు ఇతర ప్రేక్షకులు కూడా సినిమా చూసి.. బొమ్మ దద్దరిల్లింది అంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -