Friday, April 26, 2024
- Advertisement -

‘సరైనోడు’ పాటలు రిలీజ్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా… సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో… సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో… విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు. 

తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఆడియో వేడుక లాంటి ఆర్భాటాలు ఏమీ లేకుండా ఈ రోజు (ఏప్రిల్ 1న) నేరుగా మార్కెట్లోకి విడుదల చేసారు. ఏప్రిల్ రెండో వారంలో విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేయనున్నారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంజలి ఓ ప్రత్యేకగీతంలో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేసింది.ఏప్రిల్ రెండో వారంలో విశాఖపట్నంలో సరైనోడు మూవీ ప్రీ రిలీజ్ హాంగామా అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా  చేయబోతున్నారు. ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరైనోడు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను.రకుల్, కేథరీన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అల్లు అర్జున్, అంజలి కాంబినేషన్లో వచ్చే ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్ గా కానుంది.

{youtube}v=auxrmpxkop0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -