Thursday, April 25, 2024
- Advertisement -

ర‌ష్మిక‌,విజ‌య్ దేవ‌ర‌కొండ‌ మ‌ధ్య ఎఫైర్ నిజమేనా..?

- Advertisement -

ర‌ష్మిక‌,విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల కాలంలో వీరిద్ద‌రి మ‌ధ్య వచ్చిన‌న్ని రూమ‌ర్స్ మ‌రో జంట‌పై రాలేదు.వీరిద్ద‌రు క‌లిసి గీతాగోవిందం సినిమాలో న‌టించారు.ఈ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్ద‌రి న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి.ఈ సినిమా స‌మ‌యంలోనే ర‌ష్మిక త‌న ప్రేమించిన వ్య‌క్తితో ఎంగెజ్‌మెంట్‌ను కూడా రద్దు చేసుకుంది.విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఎఫైర్ కార‌ణంగానే ఆమె త‌న ఎంగెజ్‌మెంట్‌ను ర‌ద్దు చేసుకుందని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ర‌ష్మిక విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రేమ‌లో ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.అలాంటిది ఏం లేద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పిన‌ప్ప‌టికి చూసే జ‌నాల‌కు ఇది న‌మ్మ‌శ‌క్యంగా అనిపించ‌లేదు.

వెంట‌నే త‌న త‌రువాత సినిమా డియ‌ర్ కామ్రేడ్‌లో హీరోయిన్‌గా ర‌ష్మిక‌నే తీసుకోవ‌డంతో ఈ రూమ‌ర్స్ మ‌రింత ఎక్కువైయ్యాయి.తాజాగా వీరిద్ద‌రు ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ బ‌య‌టికి వ‌చ్చింది.ఎన్నిక‌లు అవ్వ‌గానే పార్టీ ఇస్తాను అన్న‌వుగా ,ఎప్పుడు ఇస్తావ్ అంటూ ర‌ష్మిక విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ప్ర‌శ్నించింది.దీనికి విజ‌య్ దేవ‌ర‌కొండ అతి త్వ‌ర‌లోనే పార్టీ ఇస్తానంటే సమాధానం ఇచ్చాడు.దీంతో వీరి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని ఊహ‌గానాలు ఎక్కువైయ్యాయి.ఒక‌వేళ వీరి మ‌ధ్య ఏదైన ఉంటే ప‌ర్స‌న‌ల్‌గా చూసుకోవచ్చు క‌దా .ఇలా ప‌బ్లిక్‌గ్గా తెలిసేలా చేయ‌డం ఏంటీ అని ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు.ఏదైన ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పే విజ‌య్ దేవ‌ర‌కొండ ,మ‌రి ఈ విష‌యంలో ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -