హీరో సుమన్ కూతురు ఇప్పుడెలా ఉందో చూడండి.?

523
See how the daughter of hero Suman is now.?
See how the daughter of hero Suman is now.?

హీరో సుమన్ అలాంటి హీరో గా మనకు అందరికి తెలిసినవాడే.. ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా సినిమాల్లో పాత్రలు చేస్తూ ఉన్నారు.. అయితే అయన వ్యక్తి గత జీవితం గురించి ఎప్పుడు బయట చెప్పలేదు.. తాజాగా అయన వ్యక్తి గత జీవితం గురించిన ఓ విషయం ఇప్పుడు అంతటా హల్చల్ అవుతుంది..

ప్రఖ్యాత తెలుగు రచయిత డి. వి. నరసరాజు గారి మనవరాలు అయిన శిరీష ని పెళ్లి చేసుకున్నారు సుమన్. వాళ్లకి ఒక కూతురు కూడా ఉంది. తన పేరు అఖిలజ ప్రత్యూష. అఖిలజ ప్రత్యూష ఎంతో గొప్ప నృత్యకారిణి.  ఇక సుమన్ 1979లో ఒక తమిళ సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టారు. ఆ తర్వాత వరుసగా మూడు సంవత్సరాలు ఎన్నో తమిళ చిత్రాల్లో నటించారు. 1982లో ఇద్దరు కిలాడీలు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

1997లో వచ్చిన అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి గా నటించారు సుమన్. ఈ సినిమా సుమన్ ఎలాంటి పాత్రలో అయినా నటించగలరు అని నిరూపించింది. అప్పటి నుండి సుమన్ మెయిన్ లీడ్ గానే కాకుండా ముఖ్య పాత్రల్లో కూడా నటించడం మొదలు పెట్టారు. అలా దేవుళ్ళు, లాహిరి లాహిరి లాహిరి లో, నీకు నేను నాకు నువ్వు, కళ్యాణ రాముడు, గంగోత్రి, తొలిచూపులోనే, అతడే ఒక సైన్యం, లీలామహల్ సెంటర్, నా అల్లుడు, శ్రీరామదాసు, శ్రీ సత్యనారాయణ స్వామి, ఒక్కడున్నాడు ఇంకా ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.

Loading...