శేఖర్ కమ్ముల కెరీర్ లో నే భారీ బడ్జెట్ చిత్రం?

341
Sekhar Kammula Big budget Movie with New Actors
Sekhar Kammula Big budget Movie with New Actors

ఫిదా సినిమా తరువాత శేఖర్ కమ్ముల ఎవరితో పని చేస్తాడు అనే రూమర్స్ చాలా వచ్చాయి. కొంత మంది వరుణ్ తేజ్ తో ఇంకో సినిమా చేస్తున్నాడు అని మరికొంత మంది విజయ్ దేవరకొండ తో సినిమా సైన్ చేస్తున్నాడు అని వార్తలు సృష్టించినప్పటికి శేఖర్ కమ్ముల మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతు కొత్త వాళ్ళతో ఒక సినిమా అన్నౌన్సు చేశాడు. ఏసియన్ సినిమాస్ తో జతకడుతూ ఈ సినిమా ని శేఖర్ కమ్ముల తనే స్వయంగా నిర్మిస్తున్నాడు కూడా.

ఈ చిత్రం కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని సమాచారం. అయితే డీవీవీ దానయ్య కుమారుడు ఈ సినిమా తో హీరో గా పరిచయం అవుతాడు అన్న వార్తలు వచ్చినప్పటికీ శేఖర్ కమ్ముల కి దగ్గరి వ్యక్తులు ఆ విషయాన్ని ఖండించారు. ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ దుబాయ్ లోని అత్యంత పాష్ లొకేషన్స్ లో జరుగుతున్నట్లు సమాచారం. ఖర్చు కి ఏ మాత్రం వెనుకాడకుండా ఈ సినిమా ని నిర్మాతలు తెరకెక్కించనునట్లు తెలుస్తుంది. శేఖర్ కమ్ముల సినిమాలలో నే ఈ సినిమా బారి బడ్జెట్ చిత్రం గా ఉండబోతోంది అనే టాక్.

ఇప్పటి వరకు అయితే ఈ సినిమా కి ఎవరెవరు పనిచేస్తున్నారు అనే విషయాలు తెలియరాలేదు కానీ మరీ కొద్ది రోజులు గడిస్తే కానీ క్లారిటీ రాదు మరి.

Loading...