Friday, April 19, 2024
- Advertisement -

పల్లవి పక్కన చైతన్య కి కష్టమే

- Advertisement -

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల ఒక చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సినిమా కి సంబందించిన పూజా కార్యక్రమాలు నేడు ఉదయం సికింద్రాబాద్ లో ని గణేష్ టెంపుల్ లో ఘనంగా జరిగాయి. ఈ సినెమా లో లవ్ స్టోరీ ప్రధానం గా ఉండబోతుంది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ మొత్తం నృత్యం మీద బేస్ అయి ఉందట. డాన్స్ బాక్డ్రాప్ లో శేఖర్ ఒక ప్రేమ కథ ని చెప్పనున్నారట. సాయి పల్లవి కన్నా గొప్ప డాన్సర్ ఎవరూ తెలుగు లో లేరు కనుక ఈ సినిమా లో హీరోయిన్ గా ఆమెని ఎంచుకున్నారు. పాత్ర పరం గా చైతన్య బాగా ఉంటాడు అని భావించి శేఖర్ చైతన్య ని అప్రోచ్ కాగా, చైతు వెంటనే ఒప్పేసుకున్నాడు.

అయితే ఈ సినిమా లో కూడా ఫిదా చిత్రం లాగా హీరోయిన్ డామినేషన్ ఎక్కువ గా ఉంటుంది అని టాక్. మజిలీ లో ఎలా అయితే సమంత డామినేట్ చేస్తూ సినిమా ని విజయానికి చేరువ చేసిందో, ఈ సినిమా లో కూడా సాయి పల్లవి అలా చేస్తే చాలు అని చైతన్య అనుకుంటున్నాడట. కాకపోతే డాన్స్ బేస్డ్ సినిమా కాబట్టి సాయి పల్లవి తో ఆడి పాడటం అంటే మాములు విషయం కాదు. సో సాయి పల్లవి పక్కన చైతన్య కి కష్టమే అని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -