జబర్దస్త్ లో రోజా ఎందుకు కనిపించడంలేదో తెలుసా ?

1500
Sekhar Master To Replace Mla Roja
Sekhar Master To Replace Mla Roja

బుల్లితెరపై జబర్దస్త్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా వచ్చిన ప్రోమోలో జబర్దస్త్ నవ్వుల రోజా మిస్ కావడం లోటుగా కనిపించింది. రోజా స్థానంలో శేఖర్ మాస్టర్ జబర్దస్త్ జడ్జీగా ఉన్నారు. అయితే ఏపీలో రాజధాని ఇష్యూ హాట్ టాపిక్ గా మారడంతో.. అక్కడ కీలకమైన భేటీల దృష్ట్యా రోజా జబర్దస్త్‌కి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఆ ఇష్యూ సర్దుకోగానే మళ్లీ రోజా జబర్దస్త్ లో కనిపించనుంది. ఇక తాజా ప్రోమోలో హైపర్ ఆది చేతికి మల్లెపూలు పెట్టుకుని ఓ కొత్త జబర్దస్త్ పోరీతో స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ‘ఏమండీ.. ఆ ఇద్దర్నీ (మను, శేఖర్ మాస్టర్) చూశారా?? ఆయన దగ్గర ఆట ఉంది.. ఈయన దగ్గర పాట ఉంది’ అని ఆది వైఫ్‌గా చేసిన మహిళ మురిసిపోవడంతో.. ‘ఏమే.. మొగుడు మల్లెపూలు చేతికి చుట్టుకుని రెడీగా ఉంటే.. ఆయన దగ్గర ఆట ఉంది.. ఈయన దగ్గర పాట ఉంది అంటావా?? మరి నా దగ్గర ఏం లేదనా??’ అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వదిలాడు.

పరాయి పురుషుడ్ని చూస్తే మీకు జెలాసీ అని ఆమె అనడంతో.. ‘పర పురుషుడు అయితే ఓకేనే.. అక్కడ ఉన్నది శేఖర్ మాస్టర్.. పురుషులందు ఆ పురుషుడు వేరయా.. విశ్వదాభి రామా ఆయన కన్ను పడిందంటే నువ్ సేఫ్ కాదే భామా??’ అంటూ మరో పంచ్ వేశాడు. ‘ఈ అందం అంతా అడవి కాచిన వెన్నెల కావాల్సిందేనా’ అని తెగ ఇబ్బందిపడిపోవడంతో.. ‘నువ్ అలాంటి హింట్లు ఇవ్వకు.. అక్కడ ఆయన కాచుకుని కూర్చున్నాడు’ అంటూ శేఖర్ మాస్టర్‌ని ఓ ఆట ఆడుకున్నాడు హైపర్ ఆది. ఇక ఇదే స్కిట్‌లో అమ్రీష్ పురి వేషం వేసిన వ్యక్తిని ఉద్దేశించి.. ‘అమ్రీష్ పురి వాయిస్ గుండెల్లోనుంచి వచ్చినట్టు ఉంటుంది.. నీ వాయిస్ గు***అంటూ గరుబ్రహ్మ చేతితో బూతు సంజ్ఞ చేశాడు హైపర్ ఆది. ఇక ఎండిపోయిన జేజమ్మగా నటించి శాంతి స్వరూప్ పొట్ట చెక్కలు చేశాడు. అందుకు సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూడండి.

ఆ పొట్ట ఏంట్రా అని స్టేజ్ మీదా ఆది పరువు తీసిన వర్షిణి..!

రానా, మిహీకాల పెళ్లి సందడి మొదలు..!

కుష్బూ నిన్ను రేప్ చేస్తా.. నటికి ఫోన్ చేసి బెదిరించాడు..!

వారి పడకగదిలోకి వెళ్లనందుకే నన్ను వేధించారు : రవీనా టండన్

Loading...