Wednesday, April 17, 2024
- Advertisement -

హీరోయిన్ రాధిక నన్ను కొట్టింది : యాక్టర్ సుధాకర్

- Advertisement -

తెలుగు సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ వేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుధాకర్ బేతా. ఒక దశలో చాలా బిజీ నటుల్లో ఆయన కూడా ఒకరు. హీరోగా కూడా చేసిన సుధాకర్ కమెడీయన్ గా బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న కామెడీ రోల్స్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాధించుకున్నాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ చెంప దెబ్బ కొట్టడంపై వివరణ ఇచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి సుధాకర్. ఇంటర్మీడియట్ తర్వాత మద్రాసు వెళ్లి.. నటనపై శిక్షణ తీసుకొని మొదట తమిళ్ లో అవకాశం దక్కించుకున్నాడు. అక్కడే చిరంజీవి, సుధాకర్ మంచి స్నేహితులయ్యారు. భారథిరాజా దర్శకత్వంలో 1978లో తెరకెక్కిన ‘కిజక్కే పోగం రైల్’ అనే సినిమాలో కథానాయకుడిగా నటించాడు సుధాకర్. ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. అందులో హీరోయిన్ గా అలనాటి స్టార్ హీరోయిన్ రాధిక నటించింది. వీరుద్దరు ఆ సినిమాతోనే హిట్ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రాధికతో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి సుధాకర్ వివరణ ఇచ్చారు.

మొదటి సినిమా మొదటి రోజు షూటింగ్ అనగానే కాస్త కంగారు పడ్డాను. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాధికతో ఫస్ట్ సీన్ అనగానే టెన్షన్ పడ్డాను. ఆమెను ఎత్తుకొని గాలిలో తిప్పాలి. అయితే అనుకోకుండా చేతులు ఆమెను తాకరని చోట తాకాయి. ఇక గోళ్లు కూడా గుచ్చుకోవడంతో రాధిక అక్కడే గట్టిగా చెంప మీద కొట్టేసింది. ఆ వివాదంతో చాలా కంగారుపడ్డాను. అమెకు సారీ చెప్పాను. ఆ తర్వాత మంచి స్నేహితులం అయ్యాం. 12సినిమాల వరకు చేశాం. మా జంటకు అప్పట్లో మంచి పేరొచ్చింది. ఫస్ట్ మూవీ వంద రోజులు ఆడింది. ఎక్కడ కలిసిన మంచి ఫ్రెండ్ లా రాధిక మాట్లాడుతుందని సుధాకర్ చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -